SAKSHITHA NEWS

వైద్యం కోసం పేదలు ఇబ్బంది పడకుండా వారి ఇంటి వద్దే మెరుగైన వైద్యం అందించడానికి మన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దే వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యల్ని గుర్తించి వారికి 5 దశల్లో ఉచితంగా 7 రకాల పరీక్షలు అందించే వైద్య సదుపాయాలతో పాటు సలహాలు సూచనలు కూడా జగనన్న సురక్ష తరహాలోనే ప్రజల కోసం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అని తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ. రక్షణ నిధి బన్నారు

బుధవారం తిరువూరు మండల పరిధిలోని మల్లెల గ్రామంలో ఎమ్మెల్యే రక్షణ నిధి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు

ఎన్టీఆర్ జిల్లా వైస్సార్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కలకొండ.రవి కుమార్ మాట్లాడుతూ ….

మీకు ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా వైద్యం అందించడమే లక్ష్యంగా, ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే ప్రభుత్వంగా, ప్రజల చెంతకే ప్రభుత్వ ఆరోగ్య యంత్రాంగం, ఏఎన్ఎం నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ల వరకు మీ కుటుంబానికి అందించడానికి ఇలాంటి మంచి పథకాలను, కార్యక్రమాలను మన ఇంటి వద్దకే తెచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డికి మనం ఎంతగానో రుణపడి ఉంటామని రవికుమార్ అన్నారు

ఈ కార్యక్రమంలో తిరువూరు ZPTC యరమాల.రామచంద్ర రెడ్డి,AMC చైర్మన్ శీలం. నాగ నర్సీ రెడ్డి, MPDO , నాగేశ్వరరావు,మల్లెల సర్పంచ్ వంగూరి. మరియమ్మ,MPTC లక్ష్మి డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS