SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలబ్ చెరువు సుందరీకరణలో భాగంగా రూ.1 కోటి 83 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న అలుగు (తూము) నిర్మాణం, చెరువులో కలుషిత, వ్యర్థ జలాలు కలవకుండా మళ్లింపు పైప్ లైన్ నిర్మాణ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .


సాక్షిత : ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ ఒకప్పుడు మురికి కూపం లాగా ఉన్న అలీ తలబ్ చెరువు కు మహర్దశ వచ్చినది అని, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు చేపట్టడం జరిగినది అని, అదేవిధంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ, మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతున్నామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరికరణ పనులు చేపడుతున్నాం అని ,చెరువు సుందరికరణ మరియు అభివృద్ధి పనులు ప్రణాళిక తో, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ రతన్ డివిజన్ ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్, నాయకులు సత్యనారాయణ, రాఘవేందర్ రెడ్డి, బ్రహ్మయ్య, కృష్ణ రెడ్డి, మహేందర్ రెడ్డి, మాధవ్, కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS