Bathukamma saree.. Samburanga mare
బతుకమ్మ చీరె.. సంబురంగా మారే!
శేరిలింగంపల్లి పరిధిలో గల గోపినగర్ అంగన్వాడి, నెహ్రూ నగర్ బస్తీ దావకానలో బతుకమ్మ పండుగ సందర్బంగా స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు మరియు రాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాగం అనిరుద్ యాదవ్ కాలనీ ఆడపడుచులకు బతుకమ్మ చీరలను అందజేశారు
పేదింటి ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వు చూసేందుకే బతుకమ్మ కానుకను ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేస్తున్నారని రాగం సుజాత యాదవ్ రాగం అనిరుద్ యాదవ్ అన్నారు, అనంతరం రాగం సుజాత యాదవ్ మాట్లాడుతూ బతుకమ్మ అంటేనే ఆడబిడ్డ పండుగ ఈ వేడుకలు అణువణువునా స్త్రీత్వం ఉట్టిపడుతుంది ఆమె జీవితం.. అస్తిత్వ పోరాటం.. ఆప్యాయతలు కనిపిస్తాయి. పుట్టింటి సంబరం మెట్టింటి సంబంధం కలగలిసి ఇల మెరిసే పండుగ బతుకమ్మ. గౌరమ్మను ఆడబిడ్డ ఆస్తిత్వ ప్రతీకగా.. విజయానికి సూచికగా పేర్కొంటారు. పుట్టింటి ఆత్మగౌరవానికి అసలైన నిర్వచనం గా చెప్తారని అన్నారు
ఈ కార్యక్రమంలో గోపి నగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, డివిజన్ ఉప అధ్యక్షులు యాదగౌడ్,వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం , గౌతమ్, రమేష్, గౌసియాబేగం,అరుణ, దీవెన తదితరులు పాల్గొన్నారు.