SAKSHITHA NEWS

స్కూల్ భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కొరకు కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి

సాక్షిత : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు, ఇందులో కూకట్ పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు పాల్గొని స్థానికంగా ఉన్న సమస్యలను కలెక్టర్ కి వివరిస్తూ వినతి పత్రం అందించారు.

బాలానగర్ డివిజన్ పరిధిలోని ఫిరోజ్ గూడ, దిల్కుష్ నగర్, చరబండ రాజు నగర్ లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సోంత భవనం ఏర్పాటుకు మరియు స్కూల్ టీచర్స్ కొరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో డివిజన్ కార్పరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఇందులో భాగంగా కార్పొరేటర్ చరబండ రాజు నగర్ లోగల మండల పరిషత్ ప్రాథమిక భవనం శిథిలావస్థలో ఉందని, వెంటనే నూతన భవనం నిర్మించాలని కలెక్టర్ ని కోరారు.

అంతేకాక ఫిరోజ్ గూడ ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థుల సంఖ్యకు సరిపడా టాయిలెట్స్ త్రాగునీటి సౌకర్యం ఉండే విధంగా మౌలిక వసతులతో పాటు భవనం పై అంతస్తు నిర్మించాలని, దిక్కుష్ నగర్ లో కోవిడ్ కి ముందు ప్రాథమిక పాఠశాల ఉండేదని, కోవిడ్ అనంతరం స్కూల్ మూసివేయడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ప్రాథమిక పాఠశాల కొరకు టీచర్లను బర్తిచేస్తే స్థానిక కమ్యూనిటీ హల్ లో స్కూల్ నీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ పాఠశాలల పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ని కార్పొరేటర్ కోరడం జరిగింది.


SAKSHITHA NEWS