SAKSHITHA NEWS

కల్వకుర్తి పట్టణంలో రోజురోజుకీ టిడిపి పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ.బాదేపల్లి రాజు గౌడ్.

సాక్షిత ప్రతినిధి.సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ సిద్ధాంతానికి జేజేలు పలుకుతున్న కల్వకుర్తి జనం* ప్రజలకోసం ప్రగతి కోసం


ఇంటింటికీ తెలుగుదేశంతన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు కల్వకుర్తి పట్టణంలో బాదేపల్లి రాజు గౌడ్ అధ్యక్షతన జోరుగా సాగుతున్న టిడిపి ప్రచారం.

కల్వకుర్తి మున్సిపాలిటీ పలు వార్డులో గడప గడప క్రీయశీల సభ్యత కార్యక్రమంలో పాల్గొంటు ప్రజల సమస్యల వింటూ నోట్ చేసుకోవడం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పక్క ఇళ్లను నిర్మించారని కల్వకుర్తి స్థానిక ఎమ్మెల్యేగా జైపాల్ యాదవ్ గెలిచి నాలుగు సంవత్సరాలు అయినా నాలుగు ఇల్లు కూడా పేదవాళ్లకు ఇవ్వలేదని టిఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తామని ఇప్పటికీ చాలామందికి ఇవ్వలేదని ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లు కూడా సమయానికి రావడం లేదని మాజీ ముఖ్యమంత్రి సర్గీయ శ్రీ నందమూరి తారక రామ రావు మొదలు పెట్టిన 1 రూపాయి రేషన్ ఇవ్వడం జరిగిందని ఇప్పుడున్న ప్రభుత్వం కుక్కలు కూడా తినని పనికిరాని బియ్యనీ నిరుపేద ప్రజలకు ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర అవిర్భవం అయినప్పటి నుంచి నేటి వరకు నూతన రేషన్ కార్డు ఇవ్వని ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనిదే అని మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలని కల్వకుర్తి నియోజకవర్గప్రజలు కోరుకుంటున్నారు.

ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం టిడిపి నాయకులు బాదేపల్లి రాజు గౌడ్ ప్రతి ఇంటికి తానే స్వయంగా వెళ్లి ప్రజలతో కష్టసుఖాలు తెలుసుకొని సమస్యలను వింటూ ప్రతి వార్డ్ వార్డు తిరుగుతూ ప్రజా సమస్యలపై టిడిపి పార్టీ ప్రజలకు అండగా ఉండి ప్రజా సమస్య తీరే విధంగా కృషి చేస్తుందని కల్వకుర్తి నియోజకవర్గ నాయకులు బాదేపల్లి రాజు గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దాదామెని బ్రహ్మం, కోమ్మగోని కృష్ణ గౌడ్, సురేష్ పాల్గొన్నారు


SAKSHITHA NEWS