వైకుంఠ ఏకాదశి సందర్భంగా అయ్యప్ప స్వామి దేవస్థానంలో పెద్ద పడిపూజ నిర్వహించిన బైరెడ్డి, దారపనేని
సాక్షిత కనిగిరి
కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భముగా పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి, కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పెద్ద పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు చిమట పట్టాభి స్వామి, చిమట కార్తీక్ స్వామి పేద మంత్రాలతో అయ్యప్ప స్వామి దేవస్థానం దద్దరిల్లేలా పెద్ద పడిపూజ కార్యక్రమం నిర్వహించారు.
మొట్టమొదటిగా విఘ్నేశ్వర స్వామి పూజతో మొదలుపెట్టి, సుబ్రహ్మణ్యస్వామి, మాళికాపుర మాత, నాగదేవత లకు ఘనంగా వేద పండితుల వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. దేవస్థానం అధ్యక్షులు విశ్వనాధుని సత్యనారాయణ (మణికంఠ స్వామి) పర్యవేక్షణలో దేవస్థానం చైర్మన్లు కావిటి వెంకటసుబ్బయ్య, గుత్తి వెంకటరాజా పెద్ద పడిపూజ కార్యక్రమం ఆద్యాతం ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయ్యప్ప స్వామి దేవస్థానంలో 18 మెట్లకు ప్రతి మెట్టు కు పడిపూజ వెలిగించి స్వామివారి కృపకు బైరెడ్డి, దారపనేని పాత్రులైనారు. పెద్ద పడిపూజ కార్యక్రమాన్ని వీక్షించుటకు అయ్యప్ప స్వాములు భారీ ఎత్తున పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద పడిపూజ అనంతరం అయ్యప్ప స్వాములకు, సివిల్ స్వాములకు బైరెడ్డి జయరామిరెడ్డి ఉదయం అల్పాహారం భిక్షను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్లు కావిటి వెంకటసుబ్బయ్య, గుత్తి వెంకటరాజా, మన్నం రమణయ్య, ఓగూరి ఏడుకొండలు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.