SAKSHITHA NEWS

Ayyappa Swami Deeksha Padipuja in full splendor in Lakshmipuram

లక్ష్మీపురంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి దీక్ష పడిపూజ
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం గ్రామంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి దీక్ష పడిపూజ రాము,రమణమ్మ దంపతులు ఆధ్వర్యంలో నిర్వహించారు.రంగురంగుల పుష్పాలతో స్వామివారు మండపాన్ని అలంకరించారు.గురుస్వాముల భజన పాటల తో మండపం ప్రాంగణమంతా భక్తి పరవశించి పులకరించింది.వివిధ ప్రాంతాల నుండి అయ్యప్ప స్వామి,భవాని దీక్ష పరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ భజన కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు పోటాపోటీగా పాటలు పాడి వారు భక్తి భావాన్ని చాటుకున్నారు.అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.ఈ పూజా కార్యక్రమంలో నాగేష్ స్వామి,బాసి గోవింద రెడ్డిస్వామి,అయ్యప్ప స్వామి,భవానీలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS