SAKSHITHA NEWS


Awareness Program on Traffic Rules: Traffic SI Vijay Bhaskar

ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం: ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్

వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ

గద్వాల:వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఉద్దేశంతో గద్వాల ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ భాస్కర్ మరియు తన సిబంది ఆధ్వర్యంలో సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ ఆఫీస్ పరిధి నందు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

తాగి వాహనాలు నడవదని, మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదని, సక్రమంగా ప్రతి ఒక్కరు లైసెన్స్ ను కలిగి ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు దారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఫోర్ వీలర్స్ సీట్ బెల్ట్ ను వేసుకొని డ్రైవింగ్ చేయాలని, తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

వాహనాల నంబర్ ప్లేట్ ను ట్యాంపరింగ్ చేయొద్దని,రాంగ్ రూట్‌లో వెళితే,ట్రాఫిక్ రూల్స్ ఉల్లాంఘిస్తే ఈచాలన్ ద్వారా జరిమానాలు వేయడం జరుగుతుందని అవగాహన కల్పించారు. తమ వాహనాలపై రెండు లేదా మూడు కంటే ఎక్కువ ఉన్న చలాన్లను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ద్వారా చెల్లించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది శివకుమార్, బలరాం, వాహనదారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS