SAKSHITHA NEWS

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చేవెళ్ల ట్రాఫిక్ సీఐ సైదులు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ తరుణంలో సిఐ సైదులు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు బండి నడపడానికి వీలు లేదు, ఒకవేళ చిన్నపిల్లలు బండి నడిపిస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. 18 సంవత్సరాలు పైబడిన వారు తగిన లైసెన్స్ తీసుకొని బండి నడపడానికి అర్హులు అని తెలియజేశారు. బండిపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలని చెప్పారు.మద్యం సేవించి వాహనాలు నడపరాదు, ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలి, మద్యం సేవించి వాహనం నడిపితే మనతోపాటు అవతల ఉన్న మనుషులకు కూడా ప్రమాదం జరగవచ్చు అని తెలియజేశారు. ఫిట్నెస్ లేని ఆటోలో ప్రయాణించడం ప్రమాదకరమని సిఐ సైదులు విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 23 At 4.57.18 Pm

SAKSHITHA NEWS