SAKSHITHA NEWS

అంధత్వం అతని శాపమా?
ఒక గుడ్డివాడిని అని చూడకుండా అందరూ కలిసి వారి మాట విననందులకు కాను అతనిపై అబాండాలు వేసుకుంటూ తమ పనులను అడ్డు వస్తున్నాడని ప్రత్యక్ష నరకం చూపెడుతున్నారు

ప్రజా ప్రతినిధుల చేతిలో కీలబొమ్మగా కాకుండ నికార్సైన ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఉద్యోగికి పైగా వికలాంగుడైన ఉద్యోగికి అండగా ఉండాల్సింది పోయి సర్పంచ్ భర్త అతనిపై జులుం చూపిస్తున్నాడని అవేదన వ్యక్తం చేశాడు.తోటి ఉద్యోగులు రాబందుల్లా సూటి పోటి మాటలతో హింసించి విచిత్ర చేష్టలు చేస్తుంటే పిలిపించి మందలివ్వల్సిన పై స్థాయి అధికారులు కూడా వారికే మద్దతు పలికితే ఇక తనకు ఎవరు దిక్కు అని వాపోతున్నాడు ఓ అంధుడు.వివరాలలోకి వెళితే కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లుర్ గ్రామ పంచాయితీలో పంచాయితి సెక్రెటరీగా ఉద్యోగం చేస్తున్న కట్ల మల్లిఖార్జున్ అనే వ్యక్తి నీ చల్లుర్ గ్రామ సర్పంచ్ భర్త అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నరని అవేదన వ్యక్తం చేశారు. తనకు నచ్చిన ఫైలు పై సంతకం చేయాలని లేనిచో ఉద్యోగం ఎలా చేస్తవో చూస్తానని బెదిరిస్తున్నడని, ఇన్నాళ్ళు ఓపిక పట్టానని ఇక తనవల్ల కావడం లేదనీ వాపోయాడు. ఈ మల్లికార్జున్ దిక్కులేని వాడికి దేవుడే దిక్కులాగా గౌరవనీయులు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గారికి మరియు గౌరవనీయులు డిస్టిక్ కలెక్టర్ గారికి విన్నవించుకున్నడు. ఇకనైనా నన్ను మనిషిలా చూడాలని వేడుకున్నాడు.


SAKSHITHA NEWS