SAKSHITHA NEWS

కమలాపూర్ లో ఘనంగా ఆటో కార్మికుల దినోత్సవం

సాక్షిత కమలాపూర్ :
కమలాపూర్ మండల కేంద్రం లో జై హనుమాన్ ఆటో యూనియన్ ఆధ్వర్యం లో ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటో డ్రైవర్ లు ఆటో లతో భారీ గా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా జై హనుమాన్ ఆటో యూనియన్ అధ్యక్షులు కూనూరి రవి మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్ పథకం వచ్చినప్పటి నుండి ఆటోలలో ఎవరు ప్రయాణం చేయకపోవడం వల్ల ఆటో డ్రైవర్ ల బతుకులు రోడ్డున పడ్డాయని అన్నారు.ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఆటో డ్రైవర్ లకు ఇచ్చిన హామీని అమలు చెయ్యాలని అన్నారుబ్. అలాగే ఆటో డ్రైవర్ లను ఆడుకుంటామని చెప్పినా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చెయ్యలేదని,ఆటోలు నడుపుకుని జీవనం కొనసాగించే డ్రైవర్ ల బతుకులు చాలా దీన స్థితి లో ఉన్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో డ్రైవర్ లకు ప్రతీ నెలా పది వేల రూపాయలు డ్రైవర్ ల అకౌంట్ లల్లో వేయాలని అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆటో కార్మికుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేస్తామని జై హనుమాన్ ఆటో యూనియన్ అధ్యక్షులు కూనూరి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు మౌటం లింగమూర్తి, ప్రధాన కార్యదర్శి ధర్ముల తిరుపతి, కోశాధికారి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 01 at 17.24.34

SAKSHITHA NEWS