‘అనుకోని ప్రయాణం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్

‘అనుకోని ప్రయాణం’ నా నట జీవితంలో ది బెస్ట్ చిత్రం.. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు : ‘అనుకోని ప్రయాణం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలలో ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై  డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 28న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. చిత్ర బృందంతో పాటు నటుడు సోహెల్, దర్శకులు వీరభద్రమ్, ఎస్వీ కృష్ణా రెడ్డి, అచ్చి రెడ్డి, విజయ భాస్కర్ కె, నందిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. నా నట జీవితంలో చేసిన చిత్రాలలో ది బెస్ట్ ‘అనుకోని ప్రయాణం’. కెరీర్ లో తొలిసారి ఒక సినిమా విషయంలో టెన్షన్ గా వున్నాను. ‘అనుకోని ప్రయాణం’ అద్భుతమైన కథ, మనసుకు ఎంతగానో నచ్చి నటించిన ఈ సినిమా ఎలా ఆడుతుందో అనే టెన్షన్ వుంది. ఆ నలుగురు సినిమా విడుదలైనప్పుడు కొంత టెన్షన్ పడ్డాను. ఆ సినిమా ట్రైలర్, పోస్టర్ లో నేను సీరియస్ గా కనిపిస్తే అందరూ కాస్త సర్ప్రైజ్ అయ్యారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన పరిస్థితి ఎలా వుంటుందో చూపించే కథ అది. అందరూ నవ్వినవ్వి వంద రోజులు చూశారు. ‘అనుకోని ప్రయాణం’ కూడా అంత పెద్ద విజయాన్ని అందుకుంటుంది. కరోనా సమయంలో మనసుని హత్తుకునే కథలు చాలా జరిగాయి. ‘అనుకోని ప్రయాణం’ కరోనా సమయంలో ప్రాణానికి ప్రాణమైన ఇద్దరు స్నేహితులు మధ్య జరిగే అద్భుతమైన కథ. ఒరిస్సా నుండి రాజమండ్రి వరకు జరిగే ఒక ‘అనుకోని ప్రయాణం’ ఇందులో అద్భుతం.  ఇది బాధలు చూపించే సినిమా కాదు. గోలగోల చేసే సినిమా. ప్రేక్షకులు కూడా కచ్చితంగా సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి చేశాను. ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతమంది చూస్తే అంత సంతోషపడతాను. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చితీరుతుంది. నరసింహ రాజు గారు ఈ కథలో నటించడమే ఒక విజయం. ఆయన అనుభవం ఈ సినిమాలో ఎంతగానో ఉపయోపడింది. డా.జగన్ మోహన్ అద్భుతమైన కథ రాశారు. వెంకటేష్ పెదిరెడ్ల చాలా చక్కగా సినిమాని తీశారు. డీవోపీ  మల్లికార్జున్ , సంగీతం శివ దినవహి .. ఇలా సాంకేతిక నిపుణులంతా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. బెక్కం వేణుగోపాల్ మంచి కంటెంట్ ని ఎంపిక చేసుకునే నిర్మాత. ‘అనుకోని ప్రయాణం’ అద్భుతమైన కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అక్టోబర్ 28న అందరూ థియేటర్లో చూడాలి” అని కోరారు. నరసింహ రాజు మాట్లాడుతూ..  రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. వైవిధ్యమైన సినిమాలు చేయడంలో ఆయనికి ఆయనే సాటి. షూటింగ్ సమయంలో కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. డా.జగన్ మోహన్ , వెంకటేష్ పెదిరెడ్ల, శివ దినవహి ఇలా అందరూ యంగ్ టీంతో కలసి చేసిన సినిమా ఇది. అక్టోబర్ 28న థియేటర్లో విడుదలౌతుంది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది” అని అన్నారు. నిర్మాత డా.జగన్ మోహన్ మాట్లాడుతూ.. ‘అనుకోని ప్రయాణం’లో రాజేంద్ర ప్రసాద్ గారు టెన్షన్ పెడతారు, నవ్విస్తారు. సినిమా అంత ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.  మంచి ఎమోషన్ కూడా వుంటుంది. కరోన సమయంలో ఈ సినిమా కథ రాసే సమయం దొరికింది. అందరూ ప్రతిభగల నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేశారు. సినిమా అందరికీ నచ్చుతుంది” అన్నారు. దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు. రాజేంద్రప్రసాద్ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. . ‘అనుకోని ప్రయాణం’ ఫీల్ గుడ్ మూవీ. మీ అందరి హార్ట్ ని టచ్ చేసే సినిమా అవుతుంది.  అక్టోబర్ 28న అందరూ  థియేటర్లో సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలి” అని కోరారు. సోహెల్ మాట్లాడుతూ..  రాజేంద్ర ప్రసాద్ యువతకు స్ఫూర్తి. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి నటకిరీటి అనిపించుకున్నారు.  ‘అనుకోని ప్రయాణం’ అందరూ చూడాల్సిన సినిమా. ‘అనుకోని ప్రయాణం’ పండగలాంటి సినిమా. ఫ్యామిలీ అంతా కలసి థియేటర్ లో సినిమా  చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు. విజయ్ భాస్కర్ కె మాట్లాడుతూ.. రాజేంద్ర ప్రసాద్ గారు ఏ పాత్రనైనా చేయగల గ్రేట్ యాక్టర్. ‘అనుకోని ప్రయాణం’ ట్రైలర్ చూస్తుంటే చాలా డెప్త్ వున్న కథలా అనిపిస్తుంది. గొప్ప ఎమోషనల్ జర్నీ కనిపిస్తోంది.సినిమా పెద్ద విజయం సాధించాలి” అని కోరారు ఎస్ వి కృష్ణ రెడ్డి మాట్లాడుతూ..  అనుకోని ప్రయాణం ట్రైలర్ అద్భుతంగా వుంది. దీనికి కారణం మా రాజేంద్రప్రసాద్ గారు. అనుకోని ప్రయాణం ప్రయాణం కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. డా.జగన్ మోహన్ గారు ఈ కథ రాయడంతో పాటు నిర్మంచడం చూస్తుంటే ఆయనకి కథపై వున్న నమ్మకం అర్ధమౌతుంది. వెంకటేష్ చక్కగా దర్సకత్వం చేశారు. శివ దినవహి మంచి మ్యూజిక్ చేశారు. అనుకోని ప్రయాణం అక్టోబర్ 28న వస్తోంది. ఈ సినిమా సంచలన విజయం సాధించాలి” అని కోరారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ .. అనుకోని ప్రయాణం కథ నచ్చి సినిమా యూనిట్ ప్రయాణం మొదలుపెట్టాను. రాజేంద్రప్రసాద్ గారు ఈ సినిమా చేయడం ఒక మలుపు. ఆయన చాలా సపోర్ట్ చేశారు. సినిమా చాలా బావుంది. చాలా కొత్తగా వుంటుంది. తెలుగు ప్రేక్షకుల కొత్తదనంను ఆదరిస్తారు. ఈ సినిమాకి కూడా మంచి విజయం అందిస్తారనే నమ్మకం వుంది. అక్టోబర్ 28న సినిమా చూసి ఆశిర్వదించాలి’ అని కోరారు నందిని రెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రప్రసాద్ గారు ఇప్పటికీ తొలి సినిమా చేస్తున్న కుర్రాడిలా ఎంతో ఉత్సాహంగా వుంటారు. ఆయన మాకు స్ఫూర్తి.  అనుకోని ప్రయాణం చాలా మంచి సినిమా అవుతుంది. బెక్కం వేణుగోపాల్ మంచి కథలని ఎంపిక చేసుకుంటారు.  ట్రైలర్ చూస్తుంటే చాలా అద్భుతమైన కథ అనిపిస్తింది. వైవిధ్యం కోరుకునే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారని భావిస్తున్నాను” అన్నారు  తారాగణం : డాక్టర్ రాజేంద్రప్రసాద్ , నరసింహరాజు,  ప్రేమ, తులసి రవిబాబు, శుభలేక సుధాకర్ నారాయణరావు , అనంత్ ప్రభాస్ శ్రీను  రంగస్థలం మహేష్  . జోగి సోదరులు ధనరాజ్  . కంచరపాలెం కిషోర్ , జెమిని సురేష్  తాగుబోతు రమేష్

‘అహింస’ నుండి ‘కమ్మగుంటదే’ పాట విడుదల చేసిన నేచురల్ స్టార్ నాని

దర్శకుడు తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ ‘అహింస’ నుండి ‘కమ్మగుంటదే’ పాట విడుదల చేసిన నేచురల్ స్టార్ నాని వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్,…

‘ఓరి దేవుడా’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను

‘ఓరి దేవుడా’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన…

సేద్యం నుంచి రైతే రాజు అనే పాట విడుదల 

సేద్యం చిత్రం నుంచి రైతే రాజు అనే పాట విడుదల  జి పి ఆర్ సినిమాస్ పతాకం పై గౌతమ్ గిరినందన్, కుషాల్ తేజ, నీల రమణ, గాయత్రి రమణ హీరో హీరోయిన్ గా చంద్రకాంత్ పసుపులేటి దర్శకత్వం వహిస్తున్న “సేద్యం”  చిత్రాని…

హ్యాపీ బర్త్ డే పృథ్వీరాజ్ సుకుమారన్‌

హ్యాపీ బర్త్ డే పృథ్వీరాజ్ సుకుమారన్‌.. ‘సలార్’లో వరదరాజ్ మన్నార్ పాత్రలో  మలయాళ సూపర్ స్టార్… క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్…

వికారాబాద్ లో ఆర్టిఐ సొసైటీ 5వ సంవత్సర సెలబ్రేషన్స్

వికారాబాద్ లో ఆర్టిఐ సొసైటీ 5వ సంవత్సర సెలబ్రేషన్స్ సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ 4 వసంతాలు పూర్తిచేసుకుని ఐదవ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా వికారాబాద్ జిల్లా ఆర్టిఐ కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు…

మన విశాఖ-మన రాజధాని

మన విశాఖ-మన రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా “విశాఖ గర్జన”కు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బయలుదేరిన ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రజలు,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఉత్తరాంధ్ర JAC పిలుపు మేరకు మరియు గౌరవ ముఖ్యమంత్రి…

గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష వికారాబాద్ జిల్లా కేంద్రం

గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా జరుగుతుంది. జిల్లాలో మొత్తం 14 సెంటర్లలో పరీక్ష నిర్వహణ కొనసాగుతుండగా మొత్తం 4857 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. పరీక్షకు ఆలస్యమైన కారణంగా ఇద్దరు అభ్యర్థులను పరీక్ష హాల్లోకి…

ఆమని లు విడుదల చేసిన  ప్రేక్షకుల మదిని దోచుకునే “మది” ట్రైలర్ 

సీనియర్ నటులు  సుమన్,ఆమని లు విడుదల చేసిన  ప్రేక్షకుల మదిని దోచుకునే “మది” ట్రైలర్  ఆర్. వి రెడ్డి సమర్పణలో  ప్రగతి పిక్చర్స్ బ్యానర్ పై శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నాగ ధనుష్ దర్శకత్వంలో రామ్ కిషన్  నిర్మిస్తున్న…

23న 4కె వెర్షన్ లో ప్రభాస్ బిల్లా రిలీజ్

ఈ నెల 23న 4కె వెర్షన్ లో ప్రభాస్ బిల్లా రిలీజ్, వసూళ్లన్నీ యూకే ఇండియాడయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ కు విరాళం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. అనుష్క…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE