ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరిగిన చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివాస్‌

Chandrakala Foundation 3rd Sarthak Diwas held grandly in the presence of celebrities తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్,.. ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరిగిన చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివాస్‌ సక్సెస్ ఫుల్, డైనమిక్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి పాత్ బ్రేకింగ్ చిత్రాలతో పాటు తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మరొక అడుగు ముందుకేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తిమ్మాపూర్ కేబినెట్ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి జన్మస్థలం కావడం మరో విశేషం. అభిషేక్ అగర్వాల్, అతని కుటుంబం చంద్రకళ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు. తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు, దివంగత అమ్మమ్మ శ్రీమతి చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు, చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివస్ హైదరాబాద్‌ లోని జే ఆర్సీ కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరిగింది. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో అభిషేక్ అగర్వాల్, తేజ్ నారాయణ్ అగర్వాల్, అనుపమ్ ఖేర్ , వివేక్ అగ్ని హోత్రి, పల్లవి జోషి, పీవీ సింధు, ఉత్తర్ ప్రదేశ్ మంత్రి నందగోపాల్, శ్రీమతి కావ్య రెడ్డి, స్నేహలతా అగర్వాల్, నిశాంత్ అగర్వాల్, అర్చన అగర్వాల్, సోనమ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ విలేజ్ మైల్ స్టోన్ ని ఆవిష్కరించారు. తిమ్మాపూర్ గ్రామ విద్యార్ధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. అభిషేక్ అగర్వాల్ కుటుంబం ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టింది.  అభిషేక్ అగర్వాల్ తండ్రి గారి పుట్టిన రోజున గ్రామాన్ని దత్తత తీసుకోవడం మరింత ఆనందకరమైన విషయం. గొప్ప పనులు చేసేవారికి అందరి ఆశీస్సులు వుంటాయి. అభిషేక్ అగర్వాల్ వెంట మేముంటాం. తిమ్మాపూర్ లో మళ్ళీ కలుస్తాం. విద్యార్ధులందరికీ నా ఆశీస్సులు. అలలకు భయపడితే పడవ ముందుకు వెళ్ళలేదు. ప్రయత్నించేవారికి ఓటమి వుండదు. మీరంతా గొప్పగా ఎదగాలి.” అని కోరారు పీవీ సింధు మాట్లాడుతూ.. గ్రామాన్ని దత్తత తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. అభిషేక్ అగర్వాల్ గారి గొప్ప మనసుకు హ్యాట్సప్. తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని అన్నీ మౌలిక వసతులు కల్పించడానికి సంకల్పించారు. గ్రామంలోని విద్యార్ధులు కూడా చక్కగా చదువుకొని మరెందరికో స్ఫూర్తిని ఇవ్వాలి. అభిషేక్ అగర్వాల్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్” తెలిపారు. పల్లవి జోషి మాట్లాడుతూ.. ఇక్కడ కూర్చున్న స్కూల్ విద్యార్ధులని చూస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తుకువచ్చాయి. అభిషేక్ అగర్వాల్ గారు గ్రామాన్ని దత్తత తీసుకోవడం మరింత మెరుగైన విద్య అందుతుందని విశ్వాసం వుంది. భవిష్యత్ లో మీలో నుండి ఒక పీవీ సిందు వస్తుందనే నమ్మకం వుంది. ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నా అభిషేక్ అగర్వాల్, తేజ్ నారాయణ్ అగర్వాల్ హృదయపూర్వక కృతజ్ఞతలు. వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. భారతదేశానికి పల్లెలు పట్టుకొమ్మలు. నాగరిక,  సంస్కృతికి మూలకేంద్రాలు పల్లెలు. ఆలాంటి పల్లెలని అభివృద్ధి పధంలోకి తీసుకురావడం నిజమైన ధర్మం, దేశభక్తి. అభిషేక్ అగర్వల్  తిమ్మాపూర్ న్ని  దత్తత తీసుకోని, ఆదర్శ గ్రామంగా మలచడానికి సంకల్పించడం గొప్ప విషయం. ఇంత గొప్ప ఉపకారాన్ని చేస్తున్న అభిషేక్ అగర్వల్ కి అభినందనలు. వారి పిల్లలు కూడా ఈ సేవకార్యక్రమాలని కొనసాగించాల్సిందిగా ఆశిస్తున్నాను. శ్రీమతి కావ్యరెడ్డి మాట్లాడుతూ.. అభిషేక్ అగర్వాల్ మా అత్తగారి ఊరు  తిమ్మాపూర్ ని దత్తత తీసుకోవడం చాలా ఆనందంగా వుంది. వారికీ మనస్పూర్తిగా అభినందనలు. గ్రామానికి విద్య వైద్యం ఇలా అన్ని మౌలిక వసతులు కల్పించి గొప్ప అభివృద్ధి పధం వైపు నడిపిస్తున్నందుకు అభిషేక్ అగర్వాల్ గారికి అభినందనలు” తెలిపారు. మంత్రి నందగోపాల్ మాట్లాడుతూ.. చంద్రకళ ఫౌండేషన్ గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తోంది. కోవిడ్ సమయంలో వారు అందించిన సేవలు మహోన్నతమైనవి. కష్ట కాలంలో వారు చూపిన ఔదార్యం అభినందనీయం. . అభిషేక్ అగర్వాల్ మరో అడుగు ముందుకేసి  తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చడానికి ముందుకు రావడం చాలా సంతోషం. చంద్రకళ ఫౌండేషన్ మరిన్ని సేవాకార్యక్రమాలతో ముందుకు వెల్లాలని, ఈ విషయంలో వారికి మా సాకారం ఉంటుంది” అని పేర్కొన్నారు. కాళి సుధీర్ మాట్లాడుతూ… అమరేంద్ర గారి ఆలోచన వలనే ఇది మొదలైయింది. ఆయనకి కృతజ్ఞతలు. జ్యోతి గారికి కృతజ్ఞతలు. పీవీ సింధు, పల్లవి జోషి, వివేక్ అగ్ని హోత్రి, నందగోపాల్, అనుపమ్ ఖేర్, కావ్యరెడ్డిగారికి .. వేడుకకు హాజరైన అందరికీ కృతజ్ఞతలు.” తెలిపారు

ఆనంద్ రవి ‘కోరమీను’ టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన లావణ్యా త్రిపాఠి

Anand Ravi’s ‘Koraminu’ title motion poster released by Lavanya Tripathi ఆనంద్ రవి ‘కోరమీను’ టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన లావణ్యా త్రిపాఠిఆనంద్ రవి కథానాయకుడిగా ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా…

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్.. ప్రేక్షకులు ఖచ్చితంగా నచ్చుతుంది

Like Share & Subscribe Fun Full Entertainer.. Audience will definitely like it లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్.. ప్రేక్షకులు ఖచ్చితంగా నచ్చుతుంది: లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో…

విడుదలకు సిద్దమైన “కౌశిక వర్మ దమయంతి”

“Kaushika Varma Damayanti” ready for release విడుదలకు సిద్దమైన “కౌశిక వర్మ దమయంతి” దమయంతి అనే రైటర్ కౌసిక్ వర్మను వశం చేసుకోవడానికి ఆమె చేసిన విశ్వ ప్రయత్నం విఫలం అవ్వడంతో తను ఇచ్చిన శాపం  ఫలితమే ఈ జన్మలో…

అంకూస్ కి మార్కెట్ వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించాలని

Ankus should be given an opportunity as the vice chairman of the market కరీంనగర్ జిల్లా వేణువంక మండలంలోని ఉద్యమ కారుడికి మద్దత్తు గా దూదేకుల కులస్తులు,,, – దూదేకుల సామాజిక వర్గానికిచెందిన మొహమ్మద్ అంకూస్ కి…

కార్తీక మాసం ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ రామోజు చంద్రమౌళి సత్యవతి దంపతులు

Sri Ramoju Chandramouli Satyavati couple performed special pujas in the month of Kartika కరీంనగర్ జిల్లా వేణువంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉసిరి చెట్టు కార్తీక మాసం ప్రత్యేక పూజలు…

హాస్టల్ ఫుడ్ బాలేదంటే విద్యార్థికి చావుదెబ్బలు

hostel food is not good, the student will be beaten to death హాస్టల్ ఫుడ్ బాలేదంటే విద్యార్థికి చావుదెబ్బలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకులంలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎనిమిదవ తరగతి…

‘అనుకోని ప్రయాణం’చిత్రాన్ని ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు

Thanks to the audience for making ‘Unexpected Journey‘ a huge success ‘అనుకోని ప్రయాణం’చిత్రాన్ని ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: ‘అనుకోని ప్రయాణం’ సక్సెస్ మీట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ…

అభిరామ్ చిత్రంలోని బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్  “చాల్లే చాల్లే” పాటను విడుదల చేసిన

Abhiram released the beautiful melody song “Challe Challe” from the movie అభిరామ్ చిత్రంలోని బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్  “చాల్లే చాల్లే” పాటను విడుదల చేసిన : ప్రముఖ దర్శకులు శివ నిర్వాణ లెజెండరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యష్…

వరుణ్ ధావన్, కృతి సనన్ “బేడియా” నుంచి ‘తుంకేశ్వరి” పాట విడుదల

Varun Dhawan, Kriti Sanon release ‘Thunkeshwari’ song from ‘Bedia‘ వరుణ్ ధావన్, కృతి సనన్ “బేడియా” నుంచి ‘తుంకేశ్వరి” పాట విడుదల బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమాబేడియా.  ఈ చిత్రాన్ని…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE