వీణవంక మండల కేంద్రం లో ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Grand celebration of Revanth Reddy’s birthday in Veenavanka Mandal Centre కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రం లో ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

`గాలోడు` ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డం హ్యాపీగా ఉంది – సుధీర్‌

Happy to see good response to ‘Galodu’ trailer – Sudhir `గాలోడు` ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డం హ్యాపీగా ఉంది – సుధీర్‌`సుడిగాలి` సుధీర్‍‍‍‍ హీరోగా న‌టిస్తోన్న ప‌క్కా మాస్అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా…

“నచ్చింది గాళ్ ఫ్రెండూ” థ్రిల్లింగ్ లవ్ స్టోరి – దర్శకుడు గురు పవన్

“Nashai Gal Friendoo” is a thrilling love story – directed by Guru Pawan “నచ్చింది గాళ్ ఫ్రెండూ” థ్రిల్లింగ్ లవ్ స్టోరి – దర్శకుడు గురు పవన్ ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న సినిమా నచ్చింది గాళ్…

ఫుల్ స్వింగులో NTR 30 ప్రీ ప్రొడక్షన్ పనులు

NTR 30 pre-production works in full swing ఫుల్ స్వింగులో NTR 30 ప్రీ ప్రొడక్షన్ పనులు.. ప్లానింగ్‌లో బిజీగా కొరటాల శివ అండ్ టీమ్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్…

 ‘వాల్తేరు వీరయ్య’ నుండి సోలమన్ సీజర్ గా బాబీ సింహా ఫస్ట్ లుక్ విడుదల

Bobby Simha as Solomon Caesar from ‘Waltheru Veeraiya’ Releases First Look మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ నుండి సోలమన్ సీజర్ గా బాబీ సింహా ఫస్ట్ లుక్ విడుదల మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నారు. ఇద్దరు స్టార్స్‌ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా ఓ కీలక పాత్ర పోస్తున్నారు. బాబీ సింహా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ”సోలమన్ సీజర్”గా చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో బాబీ సింహ లుక్ చాలా ఇంట్రస్టింగా వుంది. టక్ చేసుకున్న పూల చొక్కా, మెడలో బంగారు గొలుసులు, చేతికి బంగారు కడియం, గడియారం,  నల్లటి కళ్ళజోడు తో బ్రైట్ వింటేజ్ లుక్ లో కనిపించారు బాబీ సింహ. ఫస్ట్ లుక్ చూస్తుంటే వాల్తేరు వీరయ్య లో ”సోలమన్ సీజర్” పాత్ర చాలా కీలకంగా వుండబోతుందని అర్ధమౌతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు. సాంకేతిక విభాగం: కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్ బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్ ఎడిటర్: నిరంజన్ దేవరమానే ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్ సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి సిఈవో: చెర్రీ…

వైష్ణవి ఫిల్మ్స్ NS24 చిత్రం ఘనంగా ప్రారంభం

Vaishnavi Films NS24 is off to a solid start నాగ శౌర్య, ఎస్.ఎస్ అరుణాచలమ్, వైష్ణవి ఫిల్మ్స్ #NS24 చిత్రం ఘనంగా ప్రారంభం ప్రామిసింగ్ హీరో నాగశౌర్య 24వ చిత్రానికి నూతన దర్శకుడు ఎస్ఎస్ అరుణాచలమ్ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. #NS24 విశిష్ట అతిథుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమైయింది. పూజా కార్యక్రమానికి విచ్చేసిన దర్శకుడు వివి వినాయక్ ముహూర్తం షాట్‌ కు క్లాప్‌బోర్డ్‌ ను ఇచ్చారు. అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్ కి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. న్యూరో హాస్పిటల్ సాంబశివారెడ్డి, జి.ఎస్.కె ఇన్‌ఫ్రా టెక్ సంతోష్ కుమార్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. #NS24 నాగ శౌర్య కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందబోతుంది. యూత్, ఫ్యామిలీస్‌ కి సంబంధించిన ఎలిమెంట్స్ ఉండే యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. #NS24లో కీలక పాత్రల్లోప్రముఖ తారాగణం కనిపించనుంది. అలాగే ఈ సినిమా కోసం అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా, సాయి ప్రవీణ్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌వి శేఖర్‌ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. బండి భాస్కర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. తారాగణం: నాగ శౌర్య సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: ఎస్.ఎస్ అరుణాచలమ్ నిర్మాతలు: శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి బ్యానర్: వైష్ణవి ఫిల్మ్స్ సమర్పణ: బేబీ అద్వైత, భవిష్య సంగీతం: హారిస్ జయరాజ్ డీవోపీ: వెట్రి పళనిసామి ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ ఆర్ట్: సాయి ప్రవీణ్ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే: ఎస్.వి శేఖర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బండి భాస్కర్ పీఆర్వో: వంశీ-శేఖర్

బుడుమూరు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన DMHO

DMHO inspected Budumuru Health Centre బుడుమూరు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన DMHOశ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరులో విలేజ్ హెల్త్ సెంటర్ వద్ద నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి ఆకస్మికంగా…

రాహుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణము కారణంగా అమ్మవారి ప్రధానాలయం మూసివేత

Amma’s main temple is closed due to Rahu’s partial lunar eclipse విజయవాడ రాహుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణము కారణంగా అమ్మవారి ప్రధానాలయం మూసివేత… ఉదయం 8 గంటల నుంచి ఇంద్రకీలాద్రి పై అమ్మవారి ప్రధాన ఆలయం తో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE