అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నుండి 200 మంది బీఆర్ఎస్ లో చేరిక…
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ప్రకాశం పంతులు నగర్ కు చెందిని హెల్పింగ్ హాండ్స్ యూత్ ఫోరమ్ వారు బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో సీనియర్ నాయకులు సుంకరి చందు ఆధ్వర్యంలో కాంగ్రెస్, బిజెపి నుండి మల్లేష్ ముదిరాజ్, అంజి ముదిరాజ్, సాయి కిరణ్, రానా ప్రతాప్, సురేష్ ముదిరాజ్, నరేష్ ముదిరాజ్, భరత్ కుమార్, శ్రవణ్ ముదిరాజ్, కిట్టు యాదవ్ సుమారు 200 మంది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పార్టీలో చేరిన కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరెన్నో కార్యక్రమాలతో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్, రషీద్ బైగ్, పర్శ శ్రీనివాస్, నవాబ్, సింగారం మల్లేష్, మూసా ఖాన్, రాంరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఇబ్రహీం, అబేద్, మసూద్, దుల్లప్ప, దిలీప్, చెట్ల వెంకటేష్, ఇమ్రాన్, తెలంగాణ సాయి, లక్ష్మణ్, జునైద్, హమీద్, మహిళా నాయకురాలు, యువకులు పాల్గొన్నారు.