SAKSHITHA NEWS

అడ్వకేట్ యుగేందర్ పై దాడి హేయమైన చర్య – ప్రియదర్శిని మేడి

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి

అడ్వకేట్ యుగేందర్ పై భారాస గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ భారాస ఆత్మీయ సమ్మేళనంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలపై అఖిలపక్ష సమావేశానికి వెళ్తున్న దాడి చేయడం హేయమైన చర్యగా ఆమె మండిపడ్డారు.తుంగతుర్తి ఎమ్మెల్యే భూ దందాలు,ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించినందుకు దాడి జరిగిందని తెలిపారు. భారాస మంత్రి, ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సర్కారు స్పందించి దాడికి సూత్రదారి అయిన తుంగతుర్తి ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ఇలాంటి హత్యయత్నం, భౌతిక దాడులను బీఎస్పీ సహించదని హెచ్చరించారు. ఎమ్మెల్యే భూ దందాలు,ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో జిల్లా రెవిన్యూ, పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పధకం ప్రకారమే భారాస గూండాలు దాడి చేశారని  ఆరోపించారు.కారుపై రాళ్ల దాడి జరిపి, హత్యాయత్నానికి పాల్పడిన దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కారును ఎందుకు అడ్డగించారని అడిగేలోపే తన వాహనంపై భారాస గుండాలు దాడి చేశారని యుగేందర్ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. భౌతిక దాడులు,హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని హెచ్చరించారు.తుంగతుర్తిలో ఫ్యాక్షన్ రాజకీయాలు,అధికార పార్టీ నేతల అరాచకానికి అడ్టుకట్ట వేస్తామని అన్నారు. అడ్వకేట్ పైహత్యయత్నానాన్ని రాష్ట్ర బార్ అసోసియేషన్ ఖండించాలని కోరారు.


SAKSHITHA NEWS