SAKSHITHA NEWS

సితాఫలమండీ లోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 10 వ తేదిన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ను ఆలయం నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆలయం ఛైర్మన్ నోముల ప్రకాశ్ రావు నేతృత్వంలోని బృందం పద్మారావు గౌడ్ కు ఆహ్వానం అందించింది. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యదర్శి రాజేష్ సింగ్, ఆలయం మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS