SAKSHITHA NEWS

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ పరిధిలో ని అపర్ణ హిల్ పార్క్ వద్ద నిర్వహించిన తెలంగాణ రన్ (2k) కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి , మియాపూర్ ఏసీపీ నర్సింహ రావు , CI లు తిరుపతి రావు , క్యాస్ట్రో రెడ్డి , కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి పాల్గొని జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్ నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ,ప్రజలకు ఆరోగ్యం, మరియు శారీరక వ్యాయమం ఎంతగానో తోడ్పడుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ , ప్రాణాలు ఫణంగా పెట్టి రాష్టం సాధించి అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం అని,
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసిఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలోనే ఎన్నో అద్భుతాలు సృష్టించింది వందేండ్ల అభివృద్ధి ని సాధించాం అని,సంక్షేమంలో, అభివృద్దిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగింది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.
20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలి.తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలి అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా
ఎంతో మంది అమరుల త్యాగ ఫలమే నేడు మనము అనుభవిస్తున్నాం అని , ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసుకున్న అమరుల త్యాగాలను స్మరించుకునే రోజు అని అదేవిధంగా అమరుల త్యాగాల ఫలితం తో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ప్రజానీకానికి అభివృద్ధి అనే మార్క్ ను మీ ఆశీస్సులతో అభివృద్ధి మార్క్ ను చేసి చూపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.


అదేవిధంగా
ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళుతూ బంగారు తెలంగాణ దిశగా సాగుతుందని ,తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావో రేవో తేల్చుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 2009 నవంబర్ 29 న ఆమరణ దీక్ష చేపట్టారు .కేసీఆర్ దీక్ష తెలంగాణ అంతటా ఉద్యమ స్ఫూర్తి రగిల్చింది .తెలంగాణ ఉద్యమాలు చరిత్ర పుటల్ని సువర్ణాక్షరాలతో లిఖించి ,శాంతి మార్గంలో లక్ష్య తీరాలను చేరాయి . ఆనాటి అమరవీరుల త్యాగాల ఫలితమే ఈ రోజు బంగారు తెలంగాణ ఏర్పడింది.దేశం లో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్పతనం అని, ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ పథకాల తో అలరారిస్తూ తెలంగాణ ను బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తూ మన అందరికి ఆదర్శం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొనారు. అదేవిదంగా సాగుకు ,తాగు నీటికి డోకా లేని రాష్ట్రం గా తీర్చిదిద్దుకున్నామని ,రైతులకు నిరంతరం 24 గంటల ఉచిత విద్యుత్తు ,మరియు పరిశ్రమలకు కరెంట్ కోతలు లేని రాష్ట్రం గా నేడు వెలుగులు విరాజిముతున్నదని .
రైతు బందు పతకం కింద ఎకరానికి 10 పది వేల రూపాయలు చొప్పున పంట సహాయం అందించి నిజమైన రైతు బాంధవుడు మన ముఖ్య మంత్రి కెసిఆర్ అని ,
మిషన్ కాకతీయ పథకం కింద చెరువులకు పూర్వ వైభవం ,
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగు నీరు అందిస్తున్నామని , 20,000 లీటర్ల ఉచిత మంచినీరు పథకం ద్వారా మంచి నీరు అందిస్తున్నాము అని,
వృద్ధులకు ,వికలాంగులకు ,ఒంటరి మహిళలకు ,చేనేత ,గీత కార్మికులకు ,HIV బాధితులకు ఆసరా పింఛన్లు ,
కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకం ద్వారా పేదింటి ఆడపిల్లకు అండగా ఉంటున్నామని ,
CMRF ద్వారా పేద ప్రజలకు వైద్య సహాయం కెసిఆర్ కిట్ , కంటి వెలుగు
అమ్మఒడి ,
హాస్టల్ విద్యార్థులకు సన్న రకం బియ్యం ,
గురుకుల పాఠశాలల ద్వారా అల్పసంఖ్యల వర్గాలకు ఉచిత విద్య.
మైనారిటీ రెసిడెంటిల్ స్కూల్.
 ఓవర్సీస్ స్కాలర్ షిప్
 అల్పసంఖ్యల వర్గాలకు ఉపకార వేతనాలు. వంటి అనేక సంక్షేమ పథకాలను

ముఖ్యమంత్రి కేసీఆర్

ప్రవేశపెట్టి బంగారు తెలంగాణ కు బాటలు వేస్తున్నారని ప్రభుత్వ విప్ గాంధీ

తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి,మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఉద్యమకారులు,వార్డ్ మెంబర్లు,ఏరియా కమిటీ ప్రతినిధులు,బీఆర్ ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు,పాత్రికేయ మిత్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS