SAKSHITHA NEWS

As Additional Judges of the High Court

హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా
జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెనుతురుమల్లి గోపాల కృష్ణారావు బాధ్యతల స్వీకరణ

సాక్షిత అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మరియు జస్టిస్ వెనుతురుమల్లి గోపాల కృష్ణారావు బాధ్యతలను స్వీకరించారు. ఉదయం నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం మొదటి కోర్టు హాల్ లో జరిగిన ప్రమాణ స్వీకార

కార్యక్రమంలో తొలుత భారత రాష్ట్రపతి జారీచేసిన నోటిఫికేషన్ ఆర్డరును రిజిస్ట్రార్ జనరల్ లక్ష్మణరావు చదివి వినిపించారు. అనంతరం రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మరియు జస్టిస్ వెనుతురుమల్లి గోపాల కృష్ణారావు లచే అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.

న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హారీ, జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ ఎన్.జయసూర్య, డా.జస్టిస్ కె.మన్మధరావు, జస్టిస్ బి.ఎస్.భానుమతి, జస్టిస్ ఎన్.వెంకటేశ్వర్లు, జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి, జస్టిస్ రవి చీమలపాటి, జస్టిస్ ఏ.వి.రవీంధ్రబాబు,

జస్టిస్ వి.ఆర్.కె.కృపా సాగర్, జస్టిస్ శ్రీనివాస్ ఉటుకూరు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఘంటా రామారావు, రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్స్ అసోషియేషన్ అధ్యక్షులు కె.జానకి రామి రెడ్డి, సీనియర్ అడ్వకేట్స్, అడ్వకేట్స్,రిజిస్ట్రార్స్ తదితరులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS