SAKSHITHA NEWS

Arrest of the accused in the murder of Laddagiri Sheenu

లద్దగిరి శీను హత్య నిందితుల అరెస్టు
ప్రధాన నిందితుడు కొచ్చేరువు గ్రామానికి చెందిన పిక్కిలి జనార్దన్ నాయుడు

సాక్షిత నంద్యాల జిల్లా రాయలసీమ ఇంచార్జ్

6 లక్షలు హత్యకు కాంట్రాక్టు13/02/2023 ప్యాపిలి దగ్గరలో ఏ-1 కొచ్చేరువు గ్రామానికి చెందిన పిక్కిలి జనార్దన్ నాయుడు 50 సం. తో ఏ-3 సుగాలి రాము 44 సం. ని, ఏ-2 వల్లే లక్ష్మన్న 48 సం. ఇచ్చిన సమచారం మేరకు మిగిలిన ముద్దాయిలు ను డోన్ పట్టణం ఊరిబయట ఉన్న రుద్రాక్ష గుట్ట వద్ద (ఏ-4 తో ఏ-7) నాగిరి శేఖర్ 42 సం.హరిజన లాలెప్ప 36 సం. వడ్లు నెట్టికంటయ్య 55 సం., తపేల నరసింహులు 52 సం. లను అరెస్ట్ చేయడంమైనదనీ డోన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.


పట్టుకున్న వాహనాలు:1. ఏ పి 21 ఏ పి 1953, ఏ పి 02 ఏ ఎల్ 2915, ఏ పి39 హెచ్డి 2621 నెంబర్లు గల మూడు మోటారు సైకిళ్ళు, 2. ముద్దాయిల వద్ద నుండి 6 సెల్ ఫోనులు. 3. అందరి ముద్దాయి వద్ద నుండి Rs. 57,000/- నగదు. 4. నేరానికి ఉపయోగించిన పిడి బాకు మరియు రెండు రోకలి బండలు.నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర రెడ్డి మరియు డోన్ డి.ఎస్.పి వై. శ్రీనివాసు రెడ్డి తెలిపిన వివరాల మేరకు జలదుర్గం పిఎస్ 10/2022 యు/సెక్ 302, 120(బి) ఆర/ డబ్ల్యు 34 ఐ పి సి కేసులో ముద్దాయిలు ఆయిన ఏ-1 పిక్కిలి జనార్ధన్ నాయుడుకి కొచ్చేరువు గ్రామం నందు సుద్దా గని కలదు. అయితే అదే వూరికి చెందిన లద్దగిరి శ్రీనివాసులు మైనింగ్ వ్యాపారం చేస్తూ జనార్ధన్ నాయుడుకి సుద్దగని కి రాయల్టీ లు లేవని సంబంధిత అధికారులకు చెప్పి గనిని సీజ్ చేపించి సుధటి పేర్లకు రాయల్టీలు లేవని సీజ్ చేయించడం జనార్ధన్ నాయుడుకి ఆర్థికంగా నష్టం కలుగాజేసినాడని, దానికి జనార్ధన్ నాయుడుకి పెనాల్టీలు కట్టుకొని బాడుగకు వచ్చిన ట్రిప్పర్ లను విడిపించడం వల్ల ఆర్థికంగా తీవ్ర నష్టం పోయినాడు.

సదరు విషయం జనార్ధన్ నాయుడు మనసులో పెట్టుకొని సుమారు ఒక సంవత్సరం క్రిందట లద్దగిరి శ్రీనివాసులను చంపుతాను అని ఫోన్ చేసి బెదిరించినాడు. అప్పుడు లద్దగిరి శ్రీనివాసులు కర్నూల్ ఎస్పీ ని కలవగా ఎస్పీ ఫ్యాక్షన్ జోన్ వారికీ అప్పగించగా జనార్ధన్ నాయుడు మరియు అతని బంధువు లను పిలిపించి మందలించి పంపడంయినది. అప్పటి నుంచి కూడా లద్దగిరి శ్రీనివాసులు రాయల్టీ అధికారులకు, విజిలెన్సు అధికారులకు జనార్ధన్ నాయుడు మైన్స్ పట్టించి జనార్ధన్ నాయుడునీ ఆర్థికంగా తీవ్ర నష్టం కలుగజేస్తునాడని, అతన్ను చంపేస్తే జనార్ధన్ నాయుడు మైనింగ్ వ్యాపారానికి ఎలాంటి ఆటంకులు వుండవని భావించి 2023 వ సం,, సంక్రాంతి పండుగ తర్వాత జనార్ధన్ నాయుడుకి తెలిసిన మరియు అతని కులస్థుడు చండ్రపల్లికి చెందిన వల్లె లక్ష్మన్న తో లద్దగిరి శ్రీను ను చంపడానికి 6 లక్షలు రూపాయలు కాంట్రాక్టు ఒప్పుకొని అడ్వాన్సు గా 2 లక్షల రూ,,లు నగదుగా ఇచ్చి మిగిలిన డబ్బులు పని పూర్తయిన వారం రోజుల తర్వాత ఇస్తాను అని చెప్పి.

లక్ష్మన్న తనకు పరిచయం ఉన్న కిరాయ హంతకుల తో చర్చించి శ్రీనివసులను చంపడానికి పథకం పన్నీ వారికీ ఒక్కొకరికీ 30,000/- రూపాయలు నగదు ఇచ్చినాడు. ఎలా చంపాలి ఎక్కడ చంపాలి అని జనార్ధన్ నాయుడు తో లక్ష్మన్న మరియు వారి టీం తో నిర్ధారణ చేసుకున్నారు. పథకం లో బాగంగా 08-02-2023 నాడు లద్దగిరి శ్రీనివాసులు కొచ్చేరువు నుండి హుస్సైనపురం గ్రామం కు అది లక్ష్మి ని ఎక్కించుకొని తిరిగి మల్లెంపల్లి దేవరకు వెళ్ళాతాడని అల ఒంటరిగా వెళ్ళేటప్పుడు జనార్ధన్ నాయుడు ఇచ్చిన సమాచారం మేరకు మార్గ మద్యంలో బెస్త శివలింగం పొలం వద్ద లక్ష్మన్న లద్దగిరి శ్రీను బైక్ ఆపగా అక్కడే ప్రక్కన వున్నా శేఖర్, లాలప్ప, నరసింహులు, రాము, నేట్టికంటి అందరు రోకలిబండతో కొట్టి, పిడి బాకుతో పొడిచి అక్కడనుండి వారు తెచ్చుకొన్న బైక్ లలో పారిపోయి, తప్పించుకొని తిరుగుతూ వుండగా 13 వ తేది సోమవారం జనార్ధన్ నాయుడు , లక్ష్మన్న, రాము లను అరెస్ట్ చేసి వారు ఇచ్చిన సమాచారం మేరకు మిగిలిన ముద్దాయిలు శేఖర్, లాలప్ప,

నేట్టికంటి, నరసింహులు ను 14 వ తేది అరెస్ట్ చేసి వారి నుండి ఏ పి 21 ఏ డి 1953, ఏ పి 02 ఏ ఎల్ 2915, ఏ పి 39 హెచ్ డి 2621 నెంబర్లు గల మూడు మోటారు సైకిళ్ళును, ముద్దాయిల వద్ద నుండి 6 సెల్ ఫోనులు, నగదు Rs. 57,000/స్వాధీనం చేసుకున్నామనీ తెలిపారు. ఈ కేసులో ముద్దాయిని అరెస్టు చేసిన ప్యాపిలి సీఐ శ్రీరాములు, జలదుర్గం ఎస్సై ఎం.నరేష్ మరియు ప్యాపిలి ఎస్సై సి.ఎం.రాకేశ్ వారి సిబ్బంది హెచ్ సి మోహన్ రావు, కానిస్టేబుళ్లు వెంకట రమణ, చాంద్ బాష, మాదన్న, నరసయ్య, నాగరాజు, లవకుమార్ లను డోన్ డి.ఎస్.పి శ్రీనివాసుల రెడ్డి అబినందించారు.


SAKSHITHA NEWS