చట్టాలు తెలుగుదేశం పార్టీకే వర్తిస్తాయా ? వైసిపి పార్టీకి వర్తించవా ?
వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్
స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి డబ్బులు బాపట్లకు వచ్చాయి అనే ఆధారాలు మీ దగ్గర ఏమైనా వున్నాయ.. ?
నోరు వుంది కదా అని మా నాయకుడు పై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు
ఇసుక మాఫియాలో కొన్ని వందల కోట్లు సంపాయించిది ఎవరో బాపట్ల ప్రజలందరికీ తెలుసు
ఇసుక మాఫియాలో మీరు చేస్తున్న అవినీతిని సాక్ష్యాలతో సహా మేము మీడియా ముందు ఉంచాము
అదేవిధంగా రోడ్ విస్తరణ లో భాగంగా భవన యజమానులకు బాండ్ లు సకాలంలో ఇవ్వకుండా వ్యాపారస్తులను ఇబ్బందులు పాలుచేశారు. భవన యజమానులు ఎవరైనా ప్రశ్నిస్తే వారి స్థలంలో రోడ్ వంకరలు వేసి డ్రైనేజిని అస్తవ్యస్థం చేసారు
మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేసిన రోజు 2024 సంవత్సరంలో విద్యార్థులకు అడ్మిషనులు జరుగుతాయి అని చెప్పిన మీరు మెడికల్ కాలేజ్ పనులు ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదు?
రిలే నిరాహార దీక్ష చేసుకుంటానికి, ర్యాలీ చేసుకోవడానికి మాకు పర్మిషన్లు లేవు కానీ నిన్న మార్కెట్ యార్డ్ లో పెట్టిన సమావేశనికి 30పోలీస్ యాక్ట్ అమలులోకి రాదా ?
ఈ నాలుగున్నర సంవత్సర కాలం లో మీరు ఏమేమి తప్పులు చేసారో నా దగ్గర పూర్తి అధరాలు వున్నాయి. బహిరంగ చర్చకు మీరు సిద్ధమేనా ?