SAKSHITHA NEWS

Appointment of Mrs. G. Shravani Reddy as State President of Telangana Private Employment Association Women’s Section

తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా శ్రీమతి జి. శ్రావణి రెడ్డి నియామకం

సాక్షిత : ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల కార్మికుల సంక్షేమం కోసం వారి హక్కుల కోసం నిరంతరం పనిచేస్తున్న తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా శ్రీమతి జి శ్రావణ్ రెడ్డి నీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు నియమించడం జరిగినది

ఈ నియామక పత్రాన్ని సంఘం వ్యవస్థాపక గౌరవాధ్యక్షులు మరియు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా ఇవ్వడం జరిగినది మరియు సంఘం సలహాదారులు చేవెళ్ల పార్లమెంటు సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి ఆశీర్వదించడం జరిగినది

ఈ కార్యక్రమంలో సలహాదారులు కోలా శ్రీనివాస్ , రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్, రాష్ట్ర మీడియా సెల్ అధ్యక్షుడు ఎర్ర యాకన్న, సోషల్ మీడియా ఇంచార్జీ మోహన్ నాయక్ , మహిళ విభాగం రాష్ట్ర కార్యదర్శి సాయి లక్ష్మి ,జాయింట్ సెక్రటరీ వర లక్ష్మి , లీలా తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS