ఎస్. జె. డబ్ల్యూ. హెచ్. ఆర్. సి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా డాక్టర్ లోయపల్లి నర్సింగరావు నియామకం
- అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన జాతీయ చైర్మన్ డా. కొప్పుల విజయ్ కుమార్
శంకర్పల్లి: హైదరాబాద్ నగర పరిధిలోని కొంపల్లి కాస్ హోటల్లో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా డాక్టర్ లోయపల్లి నర్సింగరావును అధికారికంగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా కొప్పుల విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేయాలన్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ప్రతి ఒక్కరూ సమానమే అన్నారు. కుల, మత, వర్గ, వర్ణ, లింగ, రాజకీయ భేదం లేకుండా అందరూ సమానులే అని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం డాక్టర్ లోయపల్లి నర్సింగరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో మానవ హక్కుల పరిరక్షణ కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తన వంతు ప్రయత్నంలో భాగంగా అహర్నిశలు కృషి చేస్తానని, రాజ్యాంగ బద్ధంగా, సంస్థ నియమ నిబంధనల ప్రకారం మానవ హక్కుల పరిరక్షణకై నిరంతరం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ జనరల్ సెక్రటరీ మామిడాల మనోహర్, సౌత్ ఇండియన్ చైర్మన్ డాక్టర్ గంప హనుమా గౌడ్, సౌత్ ఇండియా వైస్ చైర్మన్ డాక్టర్ తిరుమలరావు, సౌత్ ఇండియా వర్కింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ నోముల సంపత్ గౌడ్, తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు సేనాపతి, తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్ కస్తూరి లక్ష్మారెడ్డి, హైదరాబాద్ సిటీ చైర్మన్ మారుపాక సతీష్ కుమార్, రాష్ట్ర డైరెక్టర్ మాలెపు నారాయణ, ఉత్తర తెలంగాణ ఇన్చార్జి చైర్మన్ సాప పండరి, వివిధ జిల్లాల హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.