SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ కి చెందిన శ్రీమతి నీలిమ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF LOC ద్వారా మంజూరైన 5,00,000/- ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF – LOC మంజూరి పత్రాన్ని బాధిత కుటుంబానికి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తో కలిసి అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని
CMRF వివరాలు

1.హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ కి చెందిన శ్రీమతి నీలిమ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF LOC ద్వారా మంజూరైన 5,00,000/- ఐదు లక్షల రూపాయలుగా మంజూరి అయినవి అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని PAC చైర్మన్ గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. PAC చైర్మన్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.


SAKSHITHA NEWS