
AP: పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. పీచుమిఠాయి శాంపిల్స్ ను సేకరించి పరీక్షలకు పంపాలని అన్ని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పీచుమిఠాయిలను సింథటిక్, అనుమతి లేని రంగులను ఉపయోగించి తయారు. చేస్తున్నారని, ఇది క్యాన్సర్ కారకమని ఆహార భద్రత కమిషనర్ జె.నివాస్ తెలిపారు. నమూనాల సేకరణ, పరీక్షల ప్రక్రియలకు నెల రోజుల సమయం పట్టొచ్చని చెప్పారు.
