SAKSHITHA NEWS

హైదరాబాద్ పట్టణ తొలి లేడీ మేయర్
కుముదిని దేవి పేరుతో నర్సింగ్ కళాశాల ప్రారంభం*

…….

సాక్షిత : నిరుపేదల సేవే లక్ష్యంగా ఆసుపత్రి ముందుకు.

రాందేవ్ రావ్ ఆసుపత్రి యాజమాన్యం తమ సేవలను మరింత విస్తృతం చేయడానికి సేవా రంగంలో మరో అడుగు ముందుకేసింది. చైతన్య మెమోరియల్ ట్రస్ట్, రాందేవ్ రావ్ ఆసుపత్రి సంయుక్తంగా కుముదిని దేవి నర్సింగ్ కళాశాలను, పాఠశాలను ప్రారంభిచామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 3 సంవత్సరాల జిఎన్ఎం కోర్స్, 4 సంవత్సరాల బిఎస్సి నర్సింగ్ కోర్సును ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే తీసుకొని సమాజంలోని అన్ని వర్గాల విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా అత్యధునిక బిల్డింగ్ మరియు హాస్టల్ సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన అధ్యాపకులు మరియు అత్యాధునికమైన ల్యాబ్ సౌకర్యం, సువిశాలమైన ప్రాంగణంలో నర్సింగ్ కోర్స్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. నర్సింగ్ కళాశాలకు అత్యంత అనుభవజ్ఞులైన డా. క్వీన్


మేరీని ప్రిన్సిపల్ గా నియమించినట్లు తెలిపారు. అత్యంత ఆధునిక సౌకర్యాలతో, సిసి కెమెరాల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన హాస్టల్ వార్డెన్ తో నాలుగు అంతస్తుల భవనాన్ని జె విక్రందేవ్ రావు ప్రారంభించడం జరిగింది,అన్ని విధాలుగా భద్రత కలిగిన హాస్టల్ భవనాన్ని జె *మీరారావ్ ప్రారంభించడం జరిగింది, మరియు హైదరాబాద్ తొలి లేడీ మేయర్ కుముదిని దేవి చిత్ర పఠాన్ని జె అపర్ణ రావ్ ఆవిష్కరించడంజరిగింది.ఈ కార్యక్రమంలో చైతన్య ట్రస్ట్ సభ్యులు, రాందేవ్ రావ్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు, రాందేవరావ్ ఆసుపత్రి ఎండి డా. కె. కమలాకర్, ఆసుపత్రి సీఈవో డా.యోబు, రాందేవ్ ఆసుపత్రి అడ్మిన్ మేనేజర్స్, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 06 At 10.48.15 Am

SAKSHITHA NEWS