Another political twist in Telangana is Thummala party changing

తెలంగాణ మరో పొలిటికల్ ట్వీస్ట్ తుమ్మల పార్టీ మారుతున్నారా?


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆత్మయ సమ్మేళనం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ములుగు జిల్లా వాజేడులో తన అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేశారు.

ఈ క్రమంలో గురువారం ఉదయం భద్రాద్రి రామయ్య ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తుమ్మల.. దాదాపు 350 కార్లతో ర్యాలీగా వాజేడుకు బయలుదేరారు. కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా తుమ్మల అనుచరులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

అయితే, ఈ సందర్భంగా తుమ్మల పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. తుమ్మల ఆత్మీయ సమ్మేళనంపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు నిఘా పెట్టినట్టు సమాచారం. ఇక, కొంత కాలం నుంచి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేరు.

దీంతో, ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొంత కాలంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాలకు తుమ్మల దూరంగా ఉంటున్నారు.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో తుమ్మల.. కాంగ్రెస్‌, బీజేపీ కీలక నేతలతో టచ్‌లో ఉన్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ వార్తలను ఒకానొక సమయంలో తుమ్మల కొట్టిపారేశారు. ఈ క్రమంలో తుమ్మల ఆత్మీయ సమ్మేళనం హాట్‌ టాపిక్‌గా మారింది.