SAKSHITHA NEWS

గిరిజనుల ఇళ్ల నిర్మాణంలో చేతి వాటం చూపిన కాకాణి అండ్ బ్యాచ్

జగనన్న కాలనీల పేరుతో భూసేకరణ నుంచి లేఅవుట్ అభివృద్ధి, ఇళ్ల నిర్మాణం వరకు అన్నింటిలో వందల కోట్ల దోపిడీ

ఈ దోపిడీకి ప్రత్యక్ష ఉదాహరణే వరిగొండలోని గిరిజనుల ఇళ్ల దుస్థితి

అమాయకులను మోసం చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోము

టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ కుంభకోణంలో భాగస్వాములైన కాంట్రాక్టర్ల నుంచి మంత్రి వరకు అందరూ శిక్ష అనుభవించడం తధ్యం

తోటపల్లి గూడూరు మండలం వరిగొండలో గిరిజనుల కోసం చేపట్టిన కాలనీని సందర్శించిన సందర్భంగా మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కాలనీలో కనీస వసతులు లేకపోవడం, మండుటెండల్లోనూ వీధులు బురదతో నిండిపోవడం, ఎక్కువ శాతం ఇళ్లు బేస్మెంట్ లెవల్ లోనే ఉండటం, పిల్లర్లు లేకుండానే ఇళ్ల నిర్మాణం చేపట్టడం, అత్యంత నాసిరకంగా పనులు చేయడం చూసి ఆవేదన వ్యక్తం చేసిన సోమిరెడ్డి

తమకు జరిగిన మోసాన్ని సోమిరెడ్డికి దృష్టికి తీసుకొచ్చిన గిరిజనులు…అండగా ఉండి న్యాయం చేయిస్తామని హామీ ఇచ్చిన సోమిరెడ్డి

మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్

జగనన్న కాలనీల పేరుతో గిరిజనులు, దళితులు పావుగా వందల కోట్ల దోపిడీ జరుగుతోంది

అందుకు ప్రత్యక్ష ఉదాహరణే వరిగొండలోని గిరిజనుల కాలనీ

తోటపల్లి గూడూరు మండల పరిధిలో 246 ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును కాకాణి గోవర్ధన్ రెడ్డి శిష్యుడు నరేంద్ర తీసుకున్నాడు

కోడూరుకు సంబంధించి రూ.40 లక్షలు, నరుకూరుకు సంబంధించి రూ.20.30 లక్షలు, వరిగొండకు సంబంధించి రూ.1.11 కోట్లతో పాటు ఇంటికి రూ.15 వేలు తోడేరు పెద్దమనిషి ఎక్కడో నుంచి ఇప్పించారంట..ఆ డబ్బులు రూ.36.90 లక్షలు. మొత్తం కలిపి రూ.2.09 కోట్లు తీసుకుని ఆ నరేంద్ర వెళ్లిపోయాడు

నేను రాను, ఆ ఇళ్లు కట్టలేనని తెగేసి చెబుతున్నాడట. డబ్బులేమో డ్రా అయిపోయాయి. ఇళ్లన్నీ బేస్మెంట్ లెవల్ లోనే ఉన్నాయి

2020లో ఈ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. మరుగుదొడ్లు లేకుండా చాలీచాలనీ విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టారు. రోడ్లు కూడా ఏర్పాటు చేయలేదు

2024 ఎన్నికల వరకు వాటిని పట్టించుకోలేదు. ఈ రోజు మేము వస్తున్నామని ఒకటి రెండు ఇళ్ల వద్ద రాళ్లు తోలి హడావుడి చేస్తున్నారు

వరిగొండలో 44 బేస్మెంట్ లెవల్, 11 ఆర్.సీ లెవల్ లో ఉండగా ఒక్క ఇంటి నిర్మాణం పూర్తయింది

గిరిజనులు రూ.30 వేలు చెల్లిస్తేనే కాంక్రీట్ పిల్లర్ వేసి శ్లాబ్ వేస్తారంట. లేదంటే అరరాయితో గోడకట్టి శ్లాబ్ పోస్తారంట

ఇళ్ల నిర్మాణం జరుగుతున్న తీరు పరిశీలిస్తే సిమెంట్ రాళ్లు చేతిలోనే పిండిగా మారుతున్నాయి. ఇసుకను పట్టుకున్నట్టే ఉంది కానీ, కాంక్రీట్ ఆనవాళ్లే లేవు

గిరిజనుల ఇళ్ల కోసం తెచ్చిన సిమెంట్ బస్తాలను కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు, పెద్దరెడ్లు గోదాములో పెట్టి ఓపెన్ సేల్ కొనసాగిస్తున్నారంట

కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రం దేశవిదేశాల నుంచి ఇంపోర్టెడ్ వస్తువులు తెప్పించి కరోనా ప్యాలెస్ కట్టుకోవాలి. పేదలకు మాత్రం ఇలా చాలీచాలని ఇళ్లను నాసిరకంగా కట్టాలి

వరకవిపూడిలోనూ ఇదే పరిస్థితి. ఒక్కో గిరిజనుడి వద్ద రూ.30 వేలు నుంచి రూ.60 వేలు తీసుకుని కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోయారు

జగనన్న కాలనీలకు జరిపిన భూసేకరణలోనే మార్జిన్లు పెట్టి కోట్లు దోచేశారు

ఇంటి స్థలం వద్ద నుంచి సిమెంట్, ఇసుక, ఇటుకలు, ఇనుము, తలుపులు, కిటికీలు అన్నింటిలోనూ దోపిడీ

అమాయక గిరిజనుల ఇళ్ల విషయంలోనూ మానవత్వం లేకుండా దోపిడీకి పాల్పడటం దుర్మార్గం

క్రూరమృగాలు కూడా ఇంత అమానుషంగా వ్యవహరించవు…ఓ పది రోజులు ఈ ప్రాంతంలో కాకాణి కాపురం చేయగలడా

పనికిరాని ఇళ్లు కట్టి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఎన్ని ఇళ్లలో ప్రజలు ఉంటున్నారో చెప్పండి. ఎన్ని పూర్తి చేశారో వివరాలు బయటపెట్టండి

టీడీపీ ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లు కూడా చూడండి. ప్రత్యేక పర్యవేక్షణతో అత్యంత నాణ్యతతో ఇళ్లు కట్టాం.

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.80 లక్షలతో ఇల్లు కడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి కేటాయింపు లేకుండా జగనన్న ఇళ్ల పేరుతో హడావుడి చేయడం మరో దుర్మార్గం

దళితులు, గిరిజనులు, బీసీలకు కనీసం ఇంటికి రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదా.

గతంతో పోలిస్తే సిమెంట్, ఇసుక, ఇటుక, స్టీలు ధరలు భారీగా పెరిగాయి. ఆ దామాషా ప్రకారం నిధులు కేటాయించాలనే జానం జగన్మోహన్ రెడ్డికి లేదా

రూ.3 వేల కోట్లకు పైదా దోపిడీ చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఇంటికి ఓ రూ.లక్ష కేటాయించవచ్చు కదా

జర్నలిస్టులే ఇంటింటికీ వెళ్లి విచారణ జరుపుకోవచ్చు. నేను చెప్పింది అబద్ధమైతే నన్ను ప్రశ్నించండి

టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. జరిగిన ప్రతి దోపిడీపైనా విచారణ జరిపిస్తాం.

స్పెషల్ టీం వేయించి కాంట్రాక్టర్ నుంచి మంత్రి వరకు ఎవరినీ వదిలిపెట్టం. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందే.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యానాది సంగం అధ్యక్షులు చిన్న పెంచలయ్య, యానాది సంఘాల మహా కూటమి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకుల సుదీర్, సహాయక కార్యదర్శి గందల రమేష్, కన్వీనర్ మల్లికార్జున, జిల్లా మహిళా అధయక్షురాలు అద్దురూ అరుణ, మండల పార్టీ అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కోడూరు శ్రీనివాసులు రెడ్డి, ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు, జనసేన నియోజికవర్గ ఇన్చార్జి బొబ్బెపల్లి సురేష్ నాయుడు, వాణీ భవాని, కొనతం రఘుబాబు, గ్రామ నాయకులు మస్తాన్ రెడ్డి, కర్పూరపు శ్రీనివాసులు రెడ్డి, జనా శ్రీనివాసులు మరియు మన్నెం కిరణ్ కుమార్, కాంతారావు, జీవ రత్నం, సుదీర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 03 05 at 4.17.11 PM

SAKSHITHA NEWS