SAKSHITHA NEWS

disabled వికలాంగుల హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి,…… ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సమన్వయకర్త


సాక్షితో వనపర్తి :
disabled వికలాంగుల హక్కుల సంక్షేమ సమస్యల పరిష్కారం కోసం
మరో పోరాటానికి సిద్ధం కావాలని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన వికాలాంగుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సమన్వయకర్త మాదిగ గంధం గట్టయ్య ఈ సందర్భంగావికలాంగులకు పిలుపునిచ్చారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన 6000 పింఛన్ హామీ తోపాటు నెలకొన్న సమస్యలను వెంటనేనెరవేర్చాలని డిమాండ్ చేశారు.


జిల్లా వికలాంగుల విభాగాన్ని సమన్వయం చేయడం కోసం గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నూతన కమిటీలను నిర్మించడం కోసం ఓ సమన్వయ కమిటీని నియమించడం జరుగుతుందని నూతన కమిటీల ఆధ్వర్యంలో జులై ఐదున వికలాంగుల వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు గీతా కార్మికుల పింఛన్ల సాధనకి కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అలాగే జిల్లాలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జులై 7 ఎమ్మార్పీఎస్ 30ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం కవాతు గ్రామ గ్రామాన దండోరా జెండా ఆవిష్కరణలు విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ గంధం కృష్ణయ్య విహెచ్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు కుశ కుమార్ శెట్టి నాగరాజు కురుమూర్తి తత్తేలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

disabled

SAKSHITHA NEWS