SAKSHITHA NEWS

ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం

ఇంటింటికి త్రాగునీటి కులాయి పథకం “జల్ జీవన్ మిషన్” పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచింది – ఆo.ప్ర. పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఓడించండి!

సర్పంచులకు, ఎంపీటీసీలకు,కౌన్సిలర్ కు, కార్పోరేటర్స్ కు రాజేంద్రప్రసాద్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన “సర్పంచుల ధర్నా” కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ గారు, ఇతర పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం నాయకులు ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి త్రాగునీటి కుళాయి పథకం అయిన “జల్ జీవన్” మిషన్ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కేటాయించ కుండా అశ్రద్ధతో ఆ పథకాన్ని నీరుగార్చిందని, కావునా వెంటనే ఆ పథకం పనులు అన్ని గ్రామాల్లో ప్రారంభించి, ఆ కమిటీకి సర్పంచ్ నే అధ్యక్షుడిగా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని…

అలాగే 2 నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా “ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైయస్సార్సీపి పార్టీని ఓడించడానికి తీవ్రంగా కృషి చేయాలని – రాష్ట్రంలోని అన్ని పార్టీలకు వైయస్సార్సీపి, బిజెపి, టిడిపి, జనసేన,సిపిఎం, సిపిఐ లకు చెందిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు, కౌన్సిలర్ కు, కార్పొరేటర్స్ కు రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చినారు”.

అలాగే “ఇది చాలా తీవ్రమైన నిర్ణయం అని మాకు తెలుసు కానీ మాకు మరో దారి లేక ఈ తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి మా నిధులు, అధికారాలను, విధులను దొంగిలించి వేసినారు. అవి తిరిగి ఇవ్వమని రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పార్టీల వైయస్సార్సీపి, టిడిపి, బిజెపి, జనసేన, సిపిఐ, సిపిఎం చివరకు అధికార పార్టీ వైఎస్ఆర్సిపి తో సహా మొదలగు పార్టీలకు చెందిన సర్పంచులు,ఎంపీటీసీలు,ఎంపీపీలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్స్,కార్పొరేటర్స్ గత మూడు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు” అని రాజేంద్రప్రసాద్ విమర్శించినారు.

     12,918 గ్రామాలలోని  3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని. మేము స్థానిక ప్రజాప్రతినిధులం  ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయి, అసమర్థులుగా, చేతకాన్ని వాళ్ళలా మా గ్రామాల ప్రజల చేత తీవ్ర నిందలు పడ్డాము. కానీ తప్పు మాది కాదు - జగన్ ది" అని రాజేంద్రప్రసాద్ అన్నారు

” అందుకే మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పల్లెలు శిధిలమైపోయి, గ్రామీణ ప్రజలు నాశనమైపోతారని, స్థానిక ప్రజా ప్రతినిధులు అన్యాయమైపోతారని, అందుకే జగన్మోహన్ రెడ్డి కి తగిన బుద్ధి చెప్పడానికి, గ్రామీణ ప్రజలకు తగిన న్యాయం చేయడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ కఠిన నిర్ణయం ఈరోజున తీసుకోవడం జరిగిందని” రాజేంద్రప్రసాద్ చెప్పారు.

వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ…

” రెండు నెలల్లో జరగబోయే ఏపీ అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ని, అధికార వైయస్సార్సీపి ప్రభుత్వాన్ని ఓడించడానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన ముఖ్యంగా అధికార పార్టీ అయిన వైయస్సార్సీపి పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు,జడ్పీటీసీలు,కౌన్సిలర్స్,కార్పొరేటర్స్ తీవ్రంగా కృషి చేయాలని, మన గ్రామాల, పట్టణ ప్రజలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని సాక్షాదారాలతో సహా వివరించి చెప్పి జగన్ కి వ్యతిరేకంగా మన ప్రజలతో ఓటు వేయించి ఓడించాలని “జగన్ ఓడితేనే – మన మనుగడ” అనే నినాదంతో అన్ని పార్టీల సర్పంచులు, ఎంపీటీసీలు,ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ఈ రెండు నెలలు చిత్తశుద్ధితో పట్టుదలగా తమ తమ గ్రామాలలో, పట్టణాలలో పనిచేయాలని” లక్ష్మీ ముత్యాలరావు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి,


SAKSHITHA NEWS