అనంతపురం నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెరువు కట్ట క్రింద ఎన్టీఆర్ మార్క్ రోడ్డు నందు చెట్ల పెంపకం కార్యక్రమంలో భాగంగా ప్రతి చెట్టుకు దాదాపు 10 వేల రూపాయలు కేటాయించి అవినీతి అక్రమాలకు పాల్పడి, నిర్వహణ లోపంతో లక్షల రూపాయిలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.
అనంతపురం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి , మేయర్ వసీం నగర అభివృద్ధి అంటే ఇదేనా? ప్రజా సంపద దుర్వినియోగం అవుతుంటే మీరేం చేస్తున్నారు? మేము నగరాన్ని 800 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశామని గొప్పలు చెబుతుంటారు, అభివృద్ధి అంటే ప్రజా సొమ్మును దుర్వినియోగం చేయడమా? మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిన ఘటనకు కారకులైన వారి పైన తగిన విచారణ జరిపి తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ ఇంచార్జ్ టి.సి వరుణ్ , రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ శ్రీమతి పెండ్యాల శ్రీలత , జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి , అంకె ఈశ్వరయ్య , నగర అధ్యక్షులు బాబు రావు , జిల్లా ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్ , కుమ్మర నాగేంద్ర , జిల్లా కమిటీ సభ్యులు అవుకు విజయ్ , ముప్పురి కృష్ణ నగర కమిటీ సభ్యులు పెండ్యాల చక్రపాణి , వళ్ళంశెట్టి వెంకట రమణ , లాల్ స్వామి ,హుస్సేన్ , ఆకుల అశోక్ ,సంపత్ కుమార్ , కార్యనిర్వహక సభ్యులు సంతోష్ కుమార్ వీర మహిళలు శ్రీమతి శైలజ , శ్రీమతి గాయత్రి ,శ్రీమతి అసీద్ , శ్రీమతి చంద్రకళ ,కుమారి సానియా ,శ్రీమతి అనసూయ ,శ్రీమతి వర్షిత , శ్రీమతి అంజలి ,శ్రీమతి అరుణ జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.