Ananta inspected the bridge works
బ్రిడ్జి పనులు పరిశీలించిన అనంత
సాక్షిత అనంతపురం : నగరంలోని టవర్‌క్లాక్ వద్ద జరుగుతున్న బ్రిడ్జి పనులను అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ప్రధాన రహదారి నుంచి బ్రిడ్జిపైకి వెళ్లి పనుల పురోగతిపై ఆరా తీశారు. వచ్చే ఏడాది జనవరి నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నడిమివంక ప్రాంతాన్ని కూడా పరిశీలించి అక్కడ రహదారి పనులు చూశారు.