SAKSHITHA NEWS

ANAKAPALLI అనకాపల్లి జిల్లా:
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెచ్‌లో ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభ వించింది.

వసంత కెమికల్స్‌లో రియా క్టర్ పేలింది. రియాక్టర్ పేలడంతో భయంతో కార్మికులు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కార్మికులకు గాయాలైనట్లు తెలిసింది

గాయపడిన కార్మికులను అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగల పూడి అనిత స్పందించారు.

జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించా లని మంత్రి ఆదేశించారు.

ANAKAPALLI