శంకర్పల్లి పట్టణ పరిధిలో బుధవారం 2కే రన్ స్వీప్ కార్యక్రమం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జరిగిందని కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఐ ఓట్ ఫర్ స్యుర్ అనే నేపథ్యంలో పురపాలక సంఘం కార్యాలయం నుండి ప్రధాన చౌరస్తా మీదుగా బీడీఎల్ క్రాస్ రోడ్డు వరకు 2కే రన్ కొనసాగింది. అనంతరం మానవహారం నిర్వహించి, ప్రతిజ్ఞ చేశారు. కమిషనర్, ఎండీఓ వెంకయ్య గౌడ్, ఎస్సై సంతోష్ రెడ్డి మాట్లాడుతూ మీ భవిష్యత్తు – మీ ఓటు, మీ ఓటు – మీ బాధ్యత అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఓటింగ్ అవుతుంది. నువ్వు ఓటు వేయకపోతే లెక్కలోకి రావు అని నానుడి ఇప్పటికీ గ్రామాల్లో ఉందని, కానీ పట్టణ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ శాతం పెరిగేలా ప్రజలకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు. ఓటు హక్కును వినియోగించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
వార్డులోని ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనే విధంగా ప్రతి పౌరుడు కృషి చేయాలని సూచించారు. స్వచ్ఛందంగా అందరూ ఓటింగ్ లో పాల్గొనే విధంగా ప్రజలను ప్రోత్సహించాలని తెలిపారు. బ్యాలెట్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ బుల్లెట్ అనే నినాదాలతో 2కే రన్ నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ ఎస్సై నాగభూషణం, మున్సిపల్ మేనేజర్ అంజన్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ జయరాజ్, సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, టిఎంసి అనూష, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఆనంద్, ప్రభుత్వ వైద్యురాలు డా. ప్రశాంతి, మునిసిపల్ సిబ్బంది వెంకటరమణ, వీర కుమార్, చంద్రశేఖర్, మహేష్, మల్లేష్, సురేందర్, వరుణ్, రాజు, కరాటే స్కూల్ టీచర్, పోలీసు, అంగన్వాడీ సిబ్బంది, యువత, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.