SAKSHITHA NEWS

గణపతిఉత్సవాలు నిమజ్జనం నిర్వహణ పై యాక్షన్ ప్లాన్ అమలుచేయాలి
(జాయింట్ కలెక్టర్ కు రాహుల్ మీనా కు నగర గణేశ ఉత్సవసమితి మెమోరాండం

కాకినాడ జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 7నుండి మొదలయ్యే గణపతి నవరాత్రి ఉత్సవాలు 16న నిర్వహించే నిమజ్జన ఉత్సవం నిర్వహణలపై
ప్రభుత్వ శాఖల సమన్వయంతో యాక్షన్ ప్లాన్ చేపట్టాలని నగర గణేశ ఉత్సవ సమితి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు మెమోరాండం అందజే సింది. వినాయక సాగర్ లో 3అడుగుల విగ్రహాల నిమజ్జనం ఏర్పాటు తో బాటుగా వన్ టౌన్ జెట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ జెట్టి చొల్లంగి చిన్న కాశీ రేవు రూరల్ సూర్యారా వు పేట సముద్ర తీరం వద్ద నిమజ్జనం నిర్వహ ణలకు ఏర్పాటు చేయా లని కోరారు. బ్రహ్మం గారి మఠం వద్ద పిండా లు కలిపే శ్రాద్ధ కర్మల ప్రదేశంలో గణపతి విగ్రహాల నిమజ్జనం మంచిది కాదని తెలిపారు. వన్ టౌన్ జెట్టి వద్ద మల మూత్రా లు కలిసే ప్రాంగణం కనుక మినహ యించా లన్నారు. జిల్లాలోని పిఠాపురం పెద్దాపురం సామర్లకోట అన్నవరం తుని ప్రత్తిపాడు జగ్గం పేట మున్నగు పట్టణా లు గ్రామాల్లో స్థానిక ఎమ్మార్వో అధ్యక్షతన పదాధికారులతో సమా వేశాలు నిర్వహించాలని
తెలియజేసారు.

సింగిల్ విండో విధానంలో ఉత్స వ నిర్వాహకులు పోలీ సు స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సిబ్బంది సమాచార సేకరణతో తోడ్పాటు ఇవ్వాలన్నారు. సాధారణ పందిళ్ళకు ఇండ్లు షాపుల నుండి కరెంటు సరఫరా పొందే అవకాశాలు కొనసాగిం చాలన్నారు. నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో వేదిక సౌండ్ సిస్టం త్రాగునీరు అంబులెన్స్ ఫ్లడ్ లైట్లు
గజారేటగాళ్లను వుంచాలని తెలిపారు. నిమజ్జనం రోజున మద్యం అమ్మకాలు దుకాణాలు తెరవ కుండా మూయించాలని ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాలలకు మధ్యా హ్నం పూట సెలవులు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఊరేగింపుల్లో తారాజువ్వలు శబ్ద వాయు కాలుష్యం కలిగించే బాణాసంచా కాల్పులు రోడ్లను అడ్డంగా మూసివేసి ట్రాఫిక్ ఇబ్బంది కలి గించే నిర్వహణలను నియంత్రణ చేయాలని కోరారు.

యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రభుత్వ శాఖల సమన్వయంతో గణేశ ఉత్సవాలు నిమజ్జనం వేడుకలకు సంపూర్ణ సహకారం ఉంటుందని ఇందుకు వీలుగా ఆర్ డి ఓ ఇట్ల కిషోర్ ఆధ్వర్యం లో ఫీల్డ్ విజిట్ చేసి నివేదిక ఇస్తారని తెలిపారు. ఉత్సవ నిర్వాహకులు తగిన విధంగా సహకరించా లని సంప్రదాయబద్ధంగాప్రజలకు ఇబ్బందిలేని రీతిలోనవరాత్రు లు జరుపుకోవాలనిఆకాంక్షిం చారు. కలెక్టర్ ముఖ్యమంత్రికి రెండు ప్రత్యేకవినతిపత్రా లను అందజేశారు.జిల్లాకన్వీనర్ యెనిమిరెడ్డి మాలకొండయ్య సమితి అధ్యక్షులు భోగిగణపతి పీఠంఉపాసకులు దూసర్లపూడి రమణరాజు గౌరవసలహా దారులు దువ్వూరి సుబ్రహ్మణ్యం రూరల్ కోకన్వీనర్ రంభాల వేంకటేశ్వర రావు సిటీ కోకన్వీనర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న సీనియర్ పదాధికారు లుబోలిశెట్టి వేంకట రామకృష్ణ తుమ్మల పద్మజ గోడి వెంకట్ చిట్టా మధు పెద్దిశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS