దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నేటి నుండి నిర్వహిస్తున్న కార్తీకమాస దీపోత్సవ వేడుకల్లో భాగంగా మొదటి కార్తీక సోమవారం(4 నవంబర్ 2024) కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి ఆహ్వానం అందింది. ఈ మేరకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ ప్రసాద్, ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, అర్చకులు మంత్రి సురేఖ గారిని హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి, కార్తీకమాస దీపోత్సవం లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రిగారికి వేదాశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈవో సుధాకర్ రెడ్డి కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో చేపట్టనున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి గారికి వివరించారు.
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో
Related Posts
దొంతాన్ పల్లిలో ఐడియల్ కిచెన్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క
SAKSHITHA NEWS దొంతాన్ పల్లిలో ఐడియల్ కిచెన్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క శంకర్పల్లి: నవంబర్ 02:శంకర్పల్లి మండల పరిధిలోని దుంతాన్ పల్లి గ్రామ శివారులో గల ఐబీఎస్ కాలేజీ ఎదురుగా నూతనంగా ఏర్పాటుచేసిన ఐడియల్ కిచెన్ ను రాష్ట్ర స్త్రీ…
అన్నదాతలకు అధైర్యం వద్దు ప్రతి వడ్ల గింజ కొంటాం
SAKSHITHA NEWS అన్నదాతలకు అధైర్యం వద్దు ప్రతి వడ్ల గింజ కొంటాం సన్న రకాలకు క్వింటాలకు 500 అదనంగా చెల్లింపు వనపర్తి జిల్లాలో 241 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సర్వం సిద్ధం వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యం…