SAKSHITHA NEWS

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వాక్యాలను ఉపసంహారించుకోవాలి.
సిపిఐ,దళిత సంఘాల నాయకుల డిమాండ్.

పార్లమెంట్ లో హోమ్ మంత్రి అమిత్ షా ప్రతిసారి అంబెడ్కర్ పేరు ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పడం వారికి అంబెడ్కర్ పైన ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని కావున వెంటనే ఆ వాక్యాలు ఉపసంహారించుకోవాలని కోరుతూ నేడు జగత్గిరిగుట్ట చివరి బస్టాప్ వద్ద కల అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన తెలిపీ అమిత్ షా చిత్రపటాలను తగలపెట్టడం జరిగింది.
ఈ సందర్బంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్,రాష్ట్ర నాయకులు ఏసురత్నం మాట్లాడుతూ హోమ్ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి తగ్గించి మాట్లాడేలా చెయ్యడం అవమానించడమేనని రాజ్యాంగం రాయక ముందు భుస్వాములు,అగ్రవర్ణ వాళ్ళకే ఓటు హక్కు,చట్ట సభ్యులుగా ఉండేవాళ్ళని కానీ అంబేద్కర్ వల్లే అందరికి ఒక ఓటు ఒక హక్కు వచ్చిందని,చెరువులో,బావి లో నీళ్లు తీసుకొనే హక్కు లేకపోతే ఆ హక్కును పోరాటం ద్వారా నీటిని తాగే హక్కును కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ అని, చదువుకు,అగ్రవర్ణాలకు దూరంగా బడిలో రానియాన్ని పరిస్థితుల నుండి అందరికి విద్యను, చదువు తమ హక్కే అని చెప్పి అగ్రవర్ణాల వాళ్ళే చదివి వాళ్ళే ఉద్యోగాలు కలిగివున్నారని కావున చదువుకు దూరంగా ఉన్న బీసీ,ఏస్సీ,ఎస్టీ లకు రిజర్వేషన్లు ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి రిజర్వేషన్లు కల్పించారని అలాంటి బాబా సాహెబ్ అంబేద్కర్ తమకు దేవుడని,అమిత్ షా చెప్పే దేవుడు మాకు అన్ని హక్కులను నిరకరించారని కావున అంబేద్కర్ ను పదులు సార్లు కాదు ప్రతిసారి అంబేద్కర్ గురించి మాట్లాడుతామని,అమిత్ షా తన వాక్యాలను ఉపసంహారించుకోకపోతే భవిషత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.


ఎమ్ జె ఎఫ్ జాతీయ,రాష్ట్ర నాయకులు రామ స్వామి, యాకయ్య లు మాట్లాడుతూ నిండు పార్లమెంటులో అంబేద్కర్ను తక్కువ చేసి మాట్లాడటం వెనుకాల ఆర్ ఎస్ ఎస్ ,బీజేపీ ల కుట్ర అసలు ఎజండా రాజ్యాంగాన్ని రద్దు చెయ్యడమేనని కావున దళితులు బీజేపీ కుట్ర కోణాలను తెలుసుకొని రాజకీయ బుద్ది చెప్పాలని, అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి దళిత హక్కుల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాములు అధ్యక్షతన, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు బాబు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్,ఏఐటీయూసీ అధ్యక్షుడు హరినాథ్,శాఖ కార్యదర్శి సహాదేవ్ రెడ్డి,సీనియర్ నాయకులు వెంకటేష్, దళిత సంఘాల నాయకులు నర్సింహా, సోమన్న, సోమయ్య, సామెల్, బాలాజీ,ఇమామ్,ఆశప్ప, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS