SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు అలుగును నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ తో, 3వ వార్డు కార్పొరేటర్ వెంకట్రామయ్య తో, 20వ వార్డు కార్పొరేటర్ బాలాజీ నాయక్ తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.


సాక్షిత : కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ* చుట్టూ ప్రక్కల కాలనీ ల నుండి వచ్చే మురుగు నీరు అంబీర్ చెరువు లో కలవకుండా ప్రత్యేక చర్యలను తీసుకుంటామని ప్రత్యేక పైప్ లైన్ ద్వారా మురుగు నీరు మల్లింపు చర్యలను చేపట్టి చెరువు కలుషితం కాకుండా చేస్తామని, చెరువును సుందరవనంగా తీర్చిదిద్దుతామని, చెరువులో మురుగు నీరు(డ్రైనేజీ) కలవడం వలన చుట్టూ పక్కల కాలనీ వాసులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలను తీసుకుంటామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియచేసారు.

అంబీర్ చెరువు అలుగు ను పరిశీలించి, అలుగు వద్ద చెత్త, చెదారం పెరుకుపోవడం వలన నీటి ప్రవాహం సాఫీగా సాగక, మురుగు నీటి వ్యవస్థ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని, అలుగు వద్ద పెరుకపోయిన చెత్త చెదారం ను వెంటనే జేసీబీ సహాయంతో అలుగు వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం జరుగుతుంది అని, పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులకు లేకుండా చూడాలని, నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు అధికారులకు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నవీన్ నాయుడు, బ్రహ్మం, సీతారామ రాజు, వర్మ, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 04 18 at 12.19.04 PM

SAKSHITHA NEWS