SAKSHITHA NEWS

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తా: శంభీపూర్ రాజు …

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభిపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్నారు…. అదేవిధంగా శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవలకు మరియు అన్నదాన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలని ఆహ్వాన పత్రికలను పలువురు అందజేశారు..


SAKSHITHA NEWS