SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 01 at 12.38.53 PM

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డితో కలిసి ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతలకు జిహెచ్ఎంసి సిబ్బందితో మరమ్మత్తు పనులు (ప్యాచ్ వర్క్) చేయించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అల్విన్ కాలనీ ఫేస్ 2 ప్రధాన రహదారి అయిన ఈ రోడ్డు రద్దీ ప్రాంతం కావడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా, అలాగే వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్యాచ్ వర్క్ పనులను పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు.


SAKSHITHA NEWS