టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రతిష్ఠాత్మకంగా భావించే బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భారతీయ సినిమా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం అందుకున్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఇప్పటికే జర్మనీకి పయనమయ్యారు. ఆ దేశ రాజధాని బెర్లిన్‌లో ఫిబ్రవరి 15న మొదలైన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ 25 వరకు జరగనుంది . ఆ వేదికపై ‘పుష్ప’ సినిమాని ప్రదర్శించనున్నారు.
‘పుష్ప’ సినిమాతో అర్జున్ విశేష క్రేజ్ సంపాదించుకోవడంతోపాటు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి ఈ పురస్కారం దక్కించుకున్న తొలి హీరోగా రికార్డు సృష్టించారు. ఆ సినిమా సీక్వెల్ ‘పుష్ప 2’తో ఇప్పుడు బిజీగా ఉన్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఇది పూర్తయిన తర్వాత అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇంతకు ముందు ఈ కాంబోలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు వచ్చాయి…
అల్లు అర్జున్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు
Related Posts
నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం
SAKSHITHA NEWS నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం తెలుగు మహిళలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి కస్తూరిపై ఫిర్యాదు చేసిన తెలుగు సంఘాలు అంతఃపురంలో చెలికత్తెలుగా వచ్చి తమిళులుగా చలామణి అయ్యారని కస్తూరి వ్యాఖ్యలు తమిళనాడులోని పలు జిల్లాల్లో…
అల్లు అర్జున్‌కు ఊరట
SAKSHITHA NEWS అల్లు అర్జున్‌కు ఊరట ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట నంద్యాలలో నమోదైన కేసును కొట్టివేసిన హైకోర్టుఎన్నికల సమయంలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు SAKSHITHA NEWS