SAKSHITHA NEWS

భవన నిర్మాణానికి స్థలం కేటాయించడం హర్షణీయం

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్

ఇచ్చిన మాట నిలుపుకున్న నాయకుడు జగదీష్ రెడ్డి

జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్

సూర్యాపేట రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించడం హర్షినియమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్నారు .సోమవారం జిల్లా కేంద్రంలోని కేసారం వద్ద భవన నిర్మాణానికి సంబంధించిన స్థలంలో భూమి పూజ చేసి మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం మంత్రి జగదీశ్ రెడ్డి ని కలిసి రియల్ ఎస్టేట్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరడంతోనే వెంటనే సానుకూలంగా స్పందించి స్థలం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నెరవేర్చిన నాయకుడు జగదీశ్ రెడ్డి అని కొనియాడారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్ ,జిల్లా సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కోశాధికారి పాల సైదులు,పట్టణ సలహాదారుడు మాదిరే డ్డి గోపాల్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న, పట్టణ ఉపాధ్యక్షుడు పందిరి మల్లేష్ గౌడ్, రాచకొండ శ్రీనివాస్, బానోత్ జానీ నాయక్,ఖమ్మoపాటి అంజయ్య గౌడ్ ,ఆకుల మారయ్య గౌడ్, ఐ తగాని మల్లయ్య గౌడ్ ,రాపర్తి దుర్గయ్య గౌడ్, రాపర్తి రమేష్ గౌడ్, పానుగంటి గిరీష్ , అమరవాది శ్రవణ్ , శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS