సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని తులసి నగర్, జ్యోతి నగర్, పండిత్ నెహ్రూ నగర్, రాణా ప్రతాప్ నగర్, యూసుఫ్ నగర్ లలో మంగళవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , నూతనంగా సిసి రోడ్ల కొరకు 2 కోట్ల 15 లక్షల రూపాయలతో శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నెల రోజుల క్రితం నిర్వహించిన పాదయాత్రలో స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది, ఒక్కొక్కటిగా సమస్యలకు పరిష్కారం చూపుతున్నారని అన్నారు ఇప్పటికీ అల్లాపూర్ డివిజన్లో దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని… ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉన్న యెడల తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, జనరల్ సెక్రటరీ పిల్లి తిరుపతి, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, ప్రధాన కార్యదర్శి ముత్యాల దుర్గ, సామ కొండల రెడ్డి, ధనరాజ్, చాంద్ సాబ్, మాధవాచారి, మహబూబ్, నాగరాజు, అనుబంధ కమిటీ అధ్యక్షులు, సంక్షేమ సంఘం అధ్యక్షులు, వార్డు సభ్యులు, ఏరియా సభ సభ్యులు, సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అల్లాపూర్ డివిజన్,సిసి రోడ్ల కొరకు 2 కోట్ల 15 లక్షల రూపాయలతో శంకుస్థాపనలు
Related Posts
దేవాలయాలు, మసీదులు ,చర్చిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి: CI రాం నర్సింహారెడ్డి
SAKSHITHA NEWS దేవాలయాలు, మసీదులు ,చర్చిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి: CI రాం నర్సింహారెడ్డి సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-బుగ్గారం పోలీస్ స్టేషన్లో దేవాలయాలు, మసీదులు మరియు చర్చిల నిర్వహకులతో ఏర్పరిచిన సమావేశంలో సీఐ ధర్మపురి మాట్లాడుతూ సీసీ కెమెరాలు…
వాంకిడి మండలంలో ఉద్రిక్తత
SAKSHITHA NEWS వాంకిడి మండలంలో ఉద్రిక్తత ఆసిఫాబాద్ జిల్లా: వాంకిడి ఆశ్రమ పాఠశాల 9వ తరగతి,విద్యార్ధిని శైలజ ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందగా.. దీంతో శైలజ మృతదేహాన్ని వాంకిడి మండలం దాబా…