ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
సహరీ, ఇఫ్తార్, ఖురాన్ పఠనం, తరావీహ్ నమాజు సలతో సహనశీలత, కృతజ్ఞతాభావం కలుగుతాయి. మండే ఎండల్లో రోజా పాటించడాన ఆకలిని తట్టుకునే సహనం అలవడుతుంది. ‘ఓ అల్లాహ్ ఇదంతా నీ కృపాకటాక్షాలతోనే సాధ్యం, నీరు వేలవేల కృతజ్ఞతలు..’ అంటూ ‘అల్లాహు అక్బర్’ నినాదాన్ని బిగ్గరగా పరిస్తూ ఈద్గాహకు చేరుకుంటారు. ‘తబబ్బలల్లాహు మిన్నా వ మిన్ కుమ్.. అంటూ వేడుకుంటారు. రంజాన్ ఆరాధనలను అల్లాహ్ స్వీకరించాలనే విన్నపం అది.
నెల రోజుల రంజాన్ ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తిచేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపే శుభసందర్భమే ఈదుల్ ఫిత్ర పర్వదినం. ఈద్గాహ్ మైదానానికి చేరుకుని అల్లాహ్ ఘనతను చాటిచెప్పే ముస్లిముల హృదయాలు పులకించిపోతాయి. ‘ఓ అల్లాహ్ ! మేము 30 దినాలు పాటించిన రంజాన్ రోజాలు, సమాజులు, సహారీ, ఇస్తారు అన్నీ నువ్వు పెట్టిన భిక్షే అంటూ ఆనంద బాష్పాలు రాల్చే శుభఘడియలు. రంజాన్ నెలలో అల్లాహ్ కు ఇచ్చిన వాగ్దానాలు మిగిలిన పదకొండు నెలలూ ఆచరణకు నోచుకోవాలని ఆశిస్తారు. ఈ స్ఫూర్తి ఎప్పటికీ కొనసాగించే భాగ్యాన్ని ఇవ్వమని విన్నవించుకుంటారు. రెండు రకాల షుక్రానా నమాజు చేస్తారు. ఈ రంజాన్ నుంచి మళ్లీ వచ్చే రంజాన్ వరకూ స్వర్గాన్ని ఉపవాసకుల కోసం ముస్తాబు చేస్తారు. అలాంటి పండుగను మరోసారి ఇచ్చినందుకు అల్లాహ్ కు షుక్రియా తెలియజేస్తారు.
రంజాన్ ప్రత్యేక రోజుల్లోనే కాదు.. ఏడాదంతా ఇలానే జీవించేలా ఆశీర్వదించమని అల్లాహిను వేడుకుంటారు. “నెలంతా ఎన్ని ఆరాధనలు, మరెన్ని పుణ్యకార్యాలు నిర్వహించినా వాటిపట్ల మాకు రవ్వ గర్వం కలగకూడదు. పాటించిన ఉపవాసాలు, పఠించిన ఖురాన్, రాత్రి వేళల్లో నిద్రను త్యాగంచేసి ఆచరించిన నమాజులు, జకాత్, ఫిత్రా దానాలను కారుణ్యంతో స్వీకరించు ప్రభూ! మా శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ‘ప్రసాదించు’ అని వేడుకుంటారు. నమాజు తర్వాత ఒకరికొకరు ‘ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పరస్పరం ఆలింగనం చేసుకుని ప్రేమను చాటుకుంటారు. అందరి పండుగ
ఈదుల్ ఫిత్ర పండుగ నాడు ముస్లిమ్ లందరూ తమ స్థాయికి తగినట్లు ఉన్నంతలో గొప్పగా వేడుక చేసుకుంటారు. ఇంటిల్లి పాదీ కొత్తబట్టలు ధరించడం, అత్తరు పరిమళాలను పులుము కోవడం ప్రవక్త సంప్రదాయంగా భావిస్తారు. షీర్ ఖుర్మా పాయసాన్ని దగ్గరి బంధువులు, మిత్రులు, ఇరుగుపొరుగు వారికి అందించి ఆత్మీయతను చాటుకుంటారు. తమకు అల్లాహ్ అనుగ్రహించిన భాగ్యాలను అందరితో పంచుకోవాలన్నది ప్రవక్త -బోధన పిత్రా, జకాత్ దానాలతో నిరుపేదలు సైతం పండుగను సంతోషంగా చేసుకుంటారు. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఫిత్రా దానాన్ని లెక్కించి పేదలకు పంచాలన్న ప్రవక్త సూక్తిని పాటిస్తారు. ఇవ్వదగిన స్థితిలో ఉండి కూడా ఫిత్రా చెల్లించకపోతే ఉపవాసాలు అల్లాహ్ స్వీకరణకు నోచుకోవు అన్నది ప్రవక్త హెచ్చరిక.
-షేక్ మదర్ సాహెబ్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
9440449642