అల్లా పూర్ సర్పంచ్ శ్రీమతి నందిని యాదయ్యగౌడ్ హై కోర్టు తీర్పుతో మళ్ళీ సర్పంచు గా కొనసాగింపు
తాండూర్ సాక్షిత : తాండూర్ మండలంపరిధి లోని, అల్లాపూర్ గ్రామపంచాయతి నిధులు దుర్వినియోగ అభియోగం పైన, శ్రీమతి నందిని యాదయ్య గౌడ్ సర్పంచ్ ను, జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు, పదవినుండి గత 3 నెలల క్రితం తొలగించారు, శ్రీమతి నందినియాదయ్య గౌడ్, దీన్ని సవాల్ చేస్తు,హై కోర్ట్ ను ఆశ్రయించగా, శ్రీమతినందిని యాదయ్య గౌడ్,సస్ పెన్సెన్ ఎత్తివేసి, తిరిగి ఆమెనే సర్పంచ్ గా కొనసాగుటకు జిల్లా కలెక్టర్ ఉత్తరువులు ఇచ్చారు, తిరిగి సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన నందిని యాదయ్య గౌడ్ మాట్లాడుతూ,గ్రామ అభివృద్ధిగురించి గ్రామవాసులు,పౌరులు, యువకులు, ప్రముఖులు అందరూ సహకరించగలరని మనుసుపూర్తి గా కో రినట్లు తెల్పినారు,