సంకినేని వెంకటేశ్వరరావు
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్ లో భారతీయ జనతా పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది…. ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురుగన్ మరియు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు హాజరయ్యారు…. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రిజర్వేషన్లు తీసేసేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేసిన కాంగ్రెస్ నాయకులు ఇంకా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు… దేశంలో పేదరిక నిర్మూలన, అన్ని రంగాల్లో దేశం బలపడడం కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 400 సీట్లు కావాలని ప్రజలను కోరుతున్నారు… తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను, నిధులను తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తుంది… బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నల్లగొండ పార్లమెంటు నుండి గెలిస్తే నల్లగొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సమస్యలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిష్కారమవుతాయి… కాంగ్రెస్ పార్టీ నాయకులు 6 గ్యారంటీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి రిజర్వేషన్ల తొలగింపు డ్రామా నూ ముందుకు తీసుకువచ్చారు… భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లను తొలగించదని ,ప్రజలు ఎవరు కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు.. త్వరలో నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో రోడ్ షోలు ఉంటాయని వాటిని కార్యకర్తలు విజయవంతం చేయాలని మరియు ప్రతి ఓటర్ ను కలిసి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేయాలని కోరారు…
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, కోఆర్డినేటర్ సుభాష్ చందర్, పార్లమెంట్ ప్రబారి చాడ శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ ప్రబారి లక్ష్మణ్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి Abid , పార్లమెంట్ కో కన్వీనర్ తుక్కాని మన్మధ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, పోలగాని ధనుంజయ్ గౌడ్, గజ్జల వెంకటరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పల్స మల్సూర్ గౌడ్, జిల్లా కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు పందిరి రామ్ రెడ్డి, పేర్వాల లక్ష్మణరావు, పోకల రాములు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ధరావత్ శ్రీనివాస్ నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు శ్రీనివాస్ లు పాల్గొన్నారు