SAKSHITHA NEWS

భద్రాచల నియోజకవర్గ ప్రజలందరి చూపు కాంగ్రెస్ వైపు….

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య కు రోజురోజుకు పెరుగుతున్న జనాధారణ….

కాంగ్రెస్ పార్టీతోనే భద్రాచలం సమస్యలు తీరుతాయి అంటున్న ప్రజలు….

ఈరోజు భద్రాచలం రాజపేట కాలనీలోని బి.ఆర్.ఎస్ పార్టీకి చెందిన 120 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ముంతాజ్ గారి నేతృత్వంలో టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన వారందరికీ భద్రాచల శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య గారు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

పార్టీలకు జాయిన్ అయిన వారు మాట్లాడుతూ….

10 సంవత్సరాల బి.ఆర్.ఎస్ పాలనలో ఏ రోజు ఏ ఒక్క పేదవాడికి కూడా న్యాయం జరగలేదని, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లేనని, రాజపేట కాలనీలోని రోడ్లన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసిన రోడ్ లేనని, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తే కోట్లు సంపాదించుకుంటున్న ఈ రోజుల్లో, అధికార పార్టీ కోట్ల రూపాయలు ఆశ చూపిన వాటన్నిటినీ తిరస్కరించి, భద్రాచల ప్రజల సమస్యల కోసం ఎదురునీలిచి పోరాడుతున్న పొదెం వీరయ్య గారిని మరోసారి గెలిపించుకున్నందుకే ఈరోజు మేము బి.ఆర్.ఎస్ పార్టీను వదిలి కాంగ్రెస్ పార్టీలోచేరటం జరిగిందని.
రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి ఆయనను గెలిపించటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వాళ్ళు మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో….

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరళ నరేష్,టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతిరేల రవికుమార్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ బుక్కా శ్వేత, భూక్య వీరబాబు, తమ్ముళ్ల వెంకటేశ్వర్లు, ఎన్.ఎస్.యు.ఐ నియోజకవర్గం అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్,యూత్ కాంగ్రెస్ యువజన అధ్యక్షులు చింతరేల సుధీర్,యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదీప్,టిడిపి నాయకులు ఎస్.కె అజీమ్,సిపిఐ నాయకులు రావులపల్లి రవికుమార్ , కల్లూరు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 11 15 At 6.03.02 Pm

SAKSHITHA NEWS