SAKSHITHA NEWS

All people should take advantage of the Kanti Velam program

కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది హుజురాబాద్ మరియు జమ్మికుంట పట్టణాలలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు

ప్రజలందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కంటి వెలుగును కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

*ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గారు *

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దఫా కంటి వెలుగును కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని *ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గారు * అన్నారు.గురువారం జమ్మికుంట పట్టణంలో మరియు హుజురాబాద్ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ……. ప్రతి వార్డులలో గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటి పరీక్ష జరిగేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో పెట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దాం అని ఆయన అన్నారు కంటి చూపు సమస్యతో బాధపడే వారి బాధలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో కంటి వెలుగు అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు.

మొదటి కంటి వెలుగు కార్యక్రమం చాలా విజయవంతం అయిందన్నారు.ఈ సారి దానిని మించి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు.కంటి వెలుగు నిర్వహించేందుకు వార్డ్ లలో గ్రామంలో కావాల్సిన వసతులు దగ్గరుండి కల్పించాలని అన్నారు. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరినీ నేతలు ఇంటికెళ్లి ఈ కార్యక్రమం దగ్గరకు తీసుకొచ్చి పరీక్షలు చేయాలన్నారు.

ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు,మందులను అవసరం అయినా వాళ్ళకి కళ్ళజోడు ఉచితంగా,అలాగే అవసరం అయినా వారికి ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తారని ఆయన తెలిపారు.ఇంత మంచి కార్యక్రమాన్ని మనం అందరం కలిసి సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టణంలోని ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్ష జరిగేలా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చెర్మైన్లు, వైస్ చెర్మైన్స్ ఎంపీపీలు, జడ్పీటీసీలు, వార్డ్ కౌన్సిలర్లు మరియు ప్రజలు అందరు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS