SAKSHITHA NEWS

భవన నిర్మాణ కార్మికులందరు ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందాలి.
సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేష్.

తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జగతగిరిగుట్ట శాఖ ఆధ్వర్యంలో నేడు గుట్ట చివరి బస్టాప్ వద్ద భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం శాఖ ఏఐటీయూసీ నాయకులు సామెల్, ముసలయ్య ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమా మహేష్, హరినాథ్ లు పాల్గొని గుర్తింపు కార్డులను అందచేసి మాట్లాడటం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులందరికి సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాయని కావున కార్మికులు వాటిని పొందాలని అలాగే కార్మికులంతా సమైక్యంగా ఉండి పోరాటం చేస్తే ఈ ఎస్ ఐ మరియు పి ఎఫ్ సౌకర్యం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల ప్రజా సంపదను మాఫీ చేస్తున్నాయి కానీ కార్మికులు దాచుకున్న డబ్బులను కార్మికులకు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయని కావున కార్మిక వ్యతిరేకియైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మికులంతా కలిసి రాబోయే ఎన్నికల్లో బుద్ది చెప్పి కార్మిక రాజ్యం కోరుకునే వామపక్షాలను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాములు,శ్రీనివాస్, సాయిలు,సోమయ్య, బాలు, బుచ్చిరాములు,శ్రీనివాసరావు, రాజేశ్వరి, సత్యవతి,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS