బీసీ కులాలన్నీ ఏకమై కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
నాకు యాదవులు మద్దతుగా నిలవాలి
యాదవులు మాటిస్తే వెనక్కిపోరు
యాదవుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, తాతా మధు, వద్దిరాజు రవిచంద్ర
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
కేసీఆర్ ఆశీర్వదించి,బీఫామ్ ఇచ్చి మీ వద్దకు పంపారు.. బీసీలంతా సమైఖ్యoగా కలసి మెలసి పని చేసి తనను గెలిపించి మళ్లీ పార్లమెంట్ కు పంపాలని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలో గురువారం జరిగిన యాదవుల ఆత్మీయ సమావేశంలో నామ మాట్లాడారు.యాదవులతో తనకు అవినాభవ సంబంధం ఉందని, యాదవులు మాట ఇస్తే వెనక్కిపోరని అన్నారు. వారికి మంత్రి పదవి ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని కులాలు కలిసి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. తన కన్న బిడ్డల కంటే మిన్నగా దివంగత చిత్తారు శ్రీహరి యాదవ్ కోరిక మేరకు ఆయన కుమార్తె ను లక్షల డోనేషన్ కట్టి ఎంబీబీఎస్ చదివించానని చెప్పారు. గత ఎన్నికల్లో కూడా యాదవులు తనకు మద్దతుగా నిలిచారని , ఈ ఎన్నికల్లో కూడా తనకు మద్దతుగా నిలిచి, తనను మంచి మెజార్టీతో గెలిపించాలని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ బీసీ బిడ్డ కూరాకుల నాగభూషణం ను కుట్రతో పదవి నుంచి దించిన కాంగ్రెస్ కు యాదవులు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.
జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కలిసి కడుపు మంటతో ఈ పని చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాదించగల సత్తా , ధైర్యం ఉన్న నామకు ఆశీస్సులు అందజేయాలని అన్నారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ గడి దొరకు , రైతు బిడ్డ నామకు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీసీలంతా ఐక్యంగా నామకు మద్దతుగా నిలవాలన్నారు. ఓటేసినందుకు కాంగ్రెస్ బీసీలపై కక్ష గట్టిందని, కుట్ర చేసి, బీసీ బిడ్డ కూరాకుల నాగభూషణం ను పదవి నుంచి తొలగించారని తెలిపారు. కేసీఆర్ 10 ఏళ్ల అద్భుత పాలనలో 86 బీసీ కులాలకు హైదరాబాద్ లో విలువైన స్థలాలు ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు.ఈ సందర్భంగా కూరాకుల నాగభూషణం ను, నామను, వద్దిరాజు రవిచంద్ర ను శాలువా తో సన్మానించారు. యాదవ్ సంఘం నాయకులు చిత్తా రు సింహాద్రి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చిలకల వెంకటనర్సయ్య యాదవ్, మేకలసుగుణారావు,కూరాకుల వలరాజు, మీగడ శ్రీనివాసరావు, తుమ్మ రాంబాబు, కోడి లింగయ్య, చిత్తారు ఇందుమతి, చింతలచెర్వు లక్ష్మీ, పద్మ, విజయలక్ష్మి, అమరబోయిన లింగయ్య, మొర్రిమేకల కోటయ్య తదితరులు పాల్గొన్నారు.